నిరుద్యోగులకు నగరపాలక సంస్థ స్పోర్ట్స్ కోచులుగా పనిచేయుటకు దరఖాస్తుల స్వీకరణ

0
399

విజయవాడ నగరపాలక సంస్థ 

12-01-2026

 

 

 *నిరుద్యోగులకు నగరపాలక సంస్థ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ల యందు తాత్కాలిక పద్ధతిలో కోచులగా పనిచేయుటకు దరఖాస్తులు స్వీకరణ*

 

 

విజయవాడ నగర పాలక సంస్థ పరధిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ ల యందు తాత్కాలిక పద్దతిన నెలకు రూ. 15,000/- గౌరవేతనము పై జిమ్ కోచ్ (2) పోస్టులు మరియు రూ. 25,000/- గౌరవేతనముపై అథ్లెటిక్ మరియు ఫిజియోథెరపి కోచ్ (1) పోస్టు లో పనిచేయుటకు గాను అర్హతలు కలిగిన నిరుద్యోగుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ డి.చంద్రశేఖర్ సోమవారం నాడు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు .

 

*జిమ్ కోచ్ కొరకు అర్హతలు:*

 

1. కనీస విద్యా అర్హత ఇంటర్మీడియట్ 

2. వయో పరిమితి 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాలు 

3. సంబంధిత పోస్టులో కనీసం 3 సంవత్సరాల అనుభవం 

4. బాడీ బిల్డింగ్‌లో జాతీయ / రాష్ట్ర / జిల్లా స్థాయి పోటీలలో పాల్గొనడం ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. 

 

*అథ్లెటిక్ & ఫిజియోథెరపిస్ట్ పోస్టుకు అర్హతలు:*

 

1. కనీస విద్యా అర్హత ఇంటర్మీడియట్ 

2. వయో పరిమితి 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాలు 

3. అథ్లెటిక్స్‌లో మాస్టర్ ఆఫ్ స్పోర్ట్స్ కోచింగ్ 

4. సంబంధిత పోస్టులో ఎన్ఐఎస్ (NIS) సర్టిఫికెట్లు కలిగి ఉండాలి 

5. అథ్లెటిక్స్‌లో జాతీయ / రాష్ట్ర / జిల్లా స్థాయి పోటీలలో పాల్గొనడం ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. 

 

 కావున పై తెలుపబడిన అర్హతలు కలిగిన అభ్యర్ధులు అన్ని వివరములతో కూడిన తమ బయోడేటాను తగు సర్టిఫికెట్లతో జతపరచి దండమూడి రాజగోపాలరావు ఇండోర్ స్టేడియము, బందర్ రోడ్డు నందుగల స్పోర్ట్స్ విభాగము నందు తేది.19-01-2026 (సోమవారం) సాయంత్రం 05.00 గం.లోపు అందచేయవలసినదిగా తెలిపారు.

 

 

 

 పౌర సంబంధాల అధికారి

 విజయవాడ నగరపాలక సంస్థ

Search
Categories
Read More
Andhra Pradesh
ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి తో చంద్రబాబు నాయుడు భేటీ
*ఢిల్లీ:*   *ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో ముఖ్యమంత్రి...
By Rajini Kumari 2026-02-10 10:24:43 0 205
Andhra Pradesh
షబేబరాత్ (పెద్దల పండుగ) సందర్భంగా శ్మశాన వాటికను పరిశీలించిన :నజీర్ అహ్మద్
షబేబరాత్ (పెద్దల పండుగ) సందర్భంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ముస్లిం శ్మశాన వాటికల్లో...
By John Baji 2026-02-03 11:33:37 0 171
Uttar Pradesh
Severe Storm Claims 89 Lives in UP: CM Yogi Orders Immediate Relief
Tragedy struck Uttar Pradesh on May 13th and 14th as a violent storm, accompanied by heavy rain...
By Dunna Jessicaruth 2026-05-14 08:42:35 0 166
Andhra Pradesh
అక్షరాంధ్ర పరీక్షలకు శతశాతం హాజరు కావాలి: కలెక్టర్
ఈనెల 28న జరిగే అక్షరాంధ్ర ప్రీ-ఫైనల్ పరీక్షకు, మార్చి 15న నిర్వహించే ఫైనల్ పరీక్షకు నమోదు...
By Boiena Rajesh 2026-02-26 02:19:16 0 308
Andhra Pradesh
డ్రగ్స్ పై దండయాత్ర
*ఎన్. టి. ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయం, విజయవాడ*     *పత్రికా...
By Rajini Kumari 2026-02-05 07:41:38 0 205
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com