అఖిలభారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య జాతీయ మహాసభలు

0
199

*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌*

*విజ‌య‌వాడ‌, జ‌న‌వ‌రి 09, 2026*

 

*అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య జాతీయ మహాసభలను జయప్రదం చేయండి*

- *సమాఖ్య వైస్ చైర్మన్, ఏపీ ఎన్‌జీజీవో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్*

 

మహారాష్ట్రలోని షిర్డీలో ఈ నెల 23 నుంచి 26వ తేదీ వర‌కు జ‌ర‌గ‌నున్న అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య 18వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని సమాఖ్య జాతీయ ఉపాధ్యక్షులు, ఏపీ ఎన్జీజీవో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ పిలుపునిచ్చారు.

విజయవాడ గాంధీనగర్ లోని ఎన్జీవో హోంలో శుక్ర‌వారం జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఎ.విద్యాసాగ‌ర్‌.. జాతీయ ప్రతినిధులు, రాష్ట్ర ఎన్జీజీవో సంఘ నాయకుల‌తో క‌లిసి మ‌హాసభల పోస్ట‌ర్‌ను ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ 60 ఏళ్ల ఘ‌న చ‌రిత్ర క‌లిగిన సమాఖ్య దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల‌కు చెందిన దాదాపు 80 లక్షల మంది ప్ర‌భుత్వ ఉద్యోగులకు నేతృత్వం వ‌హిస్తోంద‌న్నారు. జాతీయ కౌన్సిల్ సమావేశాలకు అన్ని రాష్ట్రాల నుంచి దాదాపు 1,200 మంది ప్రతినిధులు హాజరవుతార‌ని, వివిధ దేశాల నుంచి కూడా ఆత్మీయ అతిథులుగా వివిధ స‌మాఖ్య‌ల‌కు సంబంధించిన ప్రతినిధులు కూడా హాజ‌ర‌వుతార‌ని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 55 మంది ప్రతినిధులు హాజరవుతార‌ని తెలిపారు. ఈ సమావేశానికి హాజరయ్యే ప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేసిందని తెలిపారు. 

స్థానిక మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జ‌రిగే మ‌హాస‌భ‌ల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సిపిఎస్ అంశం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, వివిధ రాష్ట్రాలలో ఉన్న వేతన సవరణ సమస్యలు, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్ల మీద చర్చ, అంతర్జాతీయంగా జరుగుతున్న వివిధ పరిణామాల‌పై స‌మావేశాల్లో చ‌ర్చించి, ప‌లు తీర్మానాలు చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. 

అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు సుభాష్ లాంబా, ప్రధాన కార్యదర్శి శ్రీకుమార్ నేతృత్వంలో ఈ జాతీయ సమావేశాల నిర్వహిస్తున్నామని, ఈ సమావేశంలోనే మహిళా ప్రతినిధులకు ప్రత్యేకమైన సెషన్స్ జరుగుతాయని తెలిపారు. దేశవ్యాప్తంగా మహిళా ఉద్యోగులు ఎదుర్కొంటున్న విషయంపై ఒక రోజంతా చర్చ ఉంటుందని తెలిపారు. అదేవిధంగా అఖిలభారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య జాతీయ కార్యవర్గానికి కూడా ఈ నెల 26వ తేదీన ఎన్నికలు జరుగుతాయ‌ని తెలిపారు. ఎన్నికల్లో జాతీయ ఉపాధ్యక్షుడిగా తిరిగి పోటీచేస్తున్న‌ట్లు ఏపీ ఎన్‌జీజీవో సంఘ రాష్ట్ర అధ్య‌క్షులు విద్యాసాగ‌ర్ తెలిపారు.

కార్య‌క్ర‌మంలో ఏపీ ఎన్‌జీజీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీవీ రమణ, ఏఐఎస్జిఈఎఫ్ సబ్ కమిటీ మహిళా కార్యదర్శి రాజ్యలక్ష్మి, ఎన్జీవో సంఘ రాష్ట్ర నాయకులు జగదీశ్వరరావు, భారతీ ప్రసాద్, జానకి, శివప్రసాద్, సుబ్బారెడ్డి, క్యాపిటల్ సిటీ అధ్యక్షులు నాగభూషణం, సరస్వతి, ఎన్జీవో సంఘ ఎన్‌టీఆర్ జిల్లా అధ్యక్ష‌కార్య‌ద‌ర్శులు డి.సత్యనారాయణ రెడ్డి, పి.రమేష్, విజయవాడ నగర శాఖ అధ్యక్ష‌కార్య‌ద‌ర్శులు సివిఆర్ ప్రసాద్, ఎస్‌కే న‌జీరుద్దీన్ త‌దితరులు పాల్గొన్నారు.

(ఏపీ ఎన్‌జీజీవో కార్యాల‌యం, విజ‌య‌వాడ ద్వారా జారీ)

Search
Categories
Read More
Bharat Aawaz
అంతర్జాతీయ వేదికలపై భారత మీడియా స్వేచ్ఛ సవాల్
ఇటీవలి నార్డిక్ దేశాల పర్యటనలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం లభించినప్పటికీ, నార్వే ప్రెస్...
By Hazu MD. 2026-05-20 08:43:14 0 465
Telangana
నంగునూరు మండలం కాళేశ్వరం కాలువలో గోదావరి జలాల
నంగునూరు మండలం కాళేశ్వరం కాలువలో గోదావరి జలాల గలగలలు చూసి మనసు పులకించిన సందర్భం ,అపర భగీరథుడు...
By Ponnala Srinivasrao 2026-03-22 03:26:32 0 237
Andhra Pradesh
అధికారులతో చర్చిస్తున్న బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి
ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి...
By Boya Dasthagiri 2026-04-10 12:22:30 0 182
Andhra Pradesh
పుంగనూరు పోలీస్ స్టేషన్ పరిశీలించిన డీఎస్పీ పావని
అన్నమయ్య జిల్లా, పుంగనూరు అర్బన్ పోలీస్ స్టేషన్ ను శుక్రవారం మదనపల్లె డిఎస్పి పావని పరిశీలించారు....
By Kothuru Murali 2026-04-25 03:50:36 0 123
Telangana
Names of twins of Ram Charan and Upasana
Names of twins for Mega family ram charan and upasana are  Sivaram - Baby boy Anvira Devi...
By Terli Ashok 2026-02-13 14:22:24 0 544
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com