బాబోయ్ బాహుబలి కొండచిలువ.. ఇదేంది ఇంత ఉంది…

0
752

కర్నూలు నగరంలోని ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ ఆవరణలో భారీ కొండచిలువ కలకలం రేపింది. సుమారు 14 అడుగుల పొడవు, 30 కిలోలకుపైగా బరువున్న కొండచిలువను స్నేక్ క్యాచర్ పట్టుకుని, చంపకుండా అడవిలో విడిచిపెట్టాడు. ఈ భారీ కొండచిలువను చూసేందుకు స్థానికులు ఆసక్తి కనబరిచారు.

 

కర్నూలు నగరంలోని సీతారాం నగర్‌లో ఉన్న ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ ఆవరణలో భారీ కొండచిలువ కనిపించి స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. బాహుబలిలా పెద్దదైన ఈ కొండచిలువ సుమారు 14 అడుగుల పొడవు, 30 కిలోలకుపైగా బరువు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అకస్మాత్తుగా కొండచిలువ కనిపించడంతో కాలనీవాసులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. ప్రింటింగ్ ప్రెస్ ఆవరణలో కొండచిలువ సంచరిస్తున్నట్లు సమాచారం వేగంగా కాలనీ మొత్తం వ్యాపించింది. దీంతో స్థానికులు వెంటనే పాములు పట్టే నిపుణులకు సమాచారం అందించారు. కొద్దిసేపట్లోనే స్నేక్ క్యాచర్ సంఘటనా స్థలానికి చేరుకుని, అప్రమత్తంగా కొండచిలువను అదుపులోకి తీసుకున్నాడు. ఎలాంటి ప్రమాదం జరగకుండా, కొండచిలువను ఒక ప్రత్యేక సంచిలో బంధించి అక్కడి నుంచి తరలించారు. పట్టుబడిన కొండచిలువను చంపకుండా సమీప అడవి ప్రాంతంలో విడిచిపెట్టినట్లు స్నేక్ క్యాచర్ తెలిపారు. ఈ ఘటనతో కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నప్పటికీ, ప్రింటింగ్ ప్రెస్ ఆవరణలో భద్రతా లోపాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ ఆవరణలో ఎప్పటినుంచో పాములు, తేళ్లు వంటి విషపురుగులు సంచరిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. అడవిలా పెరిగిన పొదలు, చెత్త పేరుకుపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ప్రజల ప్రాణాల భద్రత దృష్ట్యా ప్రింటింగ్ ప్రెస్ పరిసరాలను పూర్తిగా శుభ్రం చేసి, క్లీన్ డ్రైవ్ నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి, ప్రభుత్వ కార్యాలయాల పరిసరాల్లోనూ ఇలాంటి ప్రమాదకర జీవులు కనిపించడం నగరవాసుల్లో భయాన్ని కలిగిస్తోంది. అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

 

#Sivanagendra #Trending #giantsnake

Search
Categories
Read More
Tamilnadu
Tamil Nadu Strengthens Law and Order Across the State
Tamil Nadu continues to reinforce its law and order framework through modern policing, enhanced...
By Fathima Safa 2026-07-02 07:25:57 0 87
Andhra Pradesh
బొబ్బిలి: 'ఇంటి పన్ను వసూలు వేగవంతం చేయాలి'
ఇంటిపన్ను వసూలు వేగవంతం చేయాలని ఎంపీడీవో పి.రవికుమార్ కోరారు. బొబ్బిలి మండలంలోని పారాదిలో సోమవారం...
By Boiena Rajesh 2026-03-02 08:45:35 0 210
Andhra Pradesh
పెద్దాపురం: సుదముక్యలతో సాక్ష్య కళాఖండాలు
పెద్దాపురం పట్టణానికి చెందిన గృహిణి కొరుకొండ మహాలక్ష్మి సుదముక్యలతో సాక్ష్య కళాఖండాలను తయారు చేసి...
By Ratna Sekhar 2026-02-12 08:22:04 0 457
Andhra Pradesh
A. p capitl development and economy
రాజధాని, అభివృద్ధి & ఆర్థికంఅమరావతిని ఆంధ్రప్రదేశ్ అధికారిక రాజధానిగా చట్టబద్ధత కల్పించే...
By G k Nookala 2026-02-09 17:45:22 0 311
BMA
Ashram Secrets: Godmen Weaponize Defamation Laws
Investigative reporters exposing financial irregularities, illegal land grabs, and abuse within...
By JoinBMA 2026-08-21 08:10:43 0 181
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com