ప్రముఖ ప్రవచనకర్త శ్రీ శ్రీ శ్రీ మద్దిపర్తి పద్మాకర్ గారి ప్రవచనం !!

0
236

కర్నూలు... ఆధ్యాత్మిక ప్రవచనాలతోనే యువతకు మార్గదర్శనం- మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ 

నేటి పోటీ ప్రపంచంలో తప్పుదారి పడుతున్నటువంటి యువతను సన్మార్గంలోకి తీసుకురావడానికి ఆధ్యాత్మిక ప్రవచనాలు మార్గదర్శకంగా నిలుస్తాయని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. 
స్థానిక ఎగ్జిబిషన్ గ్రౌండ్ నందు ప్రముఖ ప్రవచనకర్త శ్రీ శ్రీ శ్రీ మద్దిపర్తి పద్మాకర్ గారి 403 వ శ్రీ మద్ భాగవత సప్తాహం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ పిల్లలకు, యువతకు చిన్న వయసు నుంచే ఆధ్యాత్మిక చింతన ఆధ్యాత్మిక అలవాట్లు నేర్పించగలిగితే వారి భవిష్యత్తుకు బంగారు బాట వేసిన వారమవుతమన్నారు. ఎక్కువ చోట్ల ఆధ్యాత్మిక కార్యక్రమాలకు 60 ఏళ్లు పైబడిన వారు వస్తుంటారని అటువంటి వారి కన్నా యువత ఎక్కువగా ఇటువంటి ప్రవచనాలు వినడానికి వస్తే వారి జ్ఞానం పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. పద్మాకర్ స్వామి వారు కర్నూలుకు రావడం కర్నూలు నేల అదృష్టమని, ఆయన శిష్యులు ఎంతోమంది శిధిలావస్థకు చేరుకున్న ఆలయాలను జీర్ణోదరణ చేశారన్నారు. అటువంటి కార్యక్రమం ఎవరు చేసినా తన వంతు సహకారం అందిస్తానని టీజీ తెలిపారు. పాడుబడిన ఆలయాలకు జీర్ణోదరణకు మనం 25 శాతం నిధులు పెడితే 75% నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుందని ఆయన తెలిపారు. మన ప్రాంతంలో ఎక్కడ జీర్ణోదరణకు అవసరమైన దేవాలయాలను గుర్తిస్తే మంత్రి భరత్ ద్వారా నిధులు విడుదల చేయిస్తానని టీజీ వెంకటేష్ తెలిపారు. అంతేకాకుండా శిధిలాలయాలకు సమకూర్చవలసిన 25 శాతం నిధులు కూడా తాము సొంతంగా భరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. స్థానికంగా ఉండే ప్రజలు అటువంటి దేవాలయాలను గుర్తించి సరైన ప్రణాళిక తీసుకుని ముందుకు రావాలని ఆయన కోరారు. స్వామీజీ ప్రవచనాల కార్యక్రమానికి సంబంధించి ఎటువంటి పబ్లిసిటీ లేకపోయినా ఇంత మంది జనం రావడం ప్రజల్లో పెరుగుతున్న ఆధ్యాత్మిక చింతనకు నిదర్శనం అన్నారు. వారం రోజులపాటు జరుగనున్న ఈ కార్యక్రమాన్ని నగర ప్రజలందరూ సద్వినియోగం టీజీ వెంకటేష్ కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు, డాక్టర్ వేణుగోపాల్, హరికృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రతి హజ్ యాత్రికుడికి సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే మా లక్ష్యం
హజ్ యాత్రికులకు ఘనంగా వీడ్కోలు  హజ్ కమిటీ ఛైర్మన్ కృతజ్ఞతా పూర్వక అభినందనలు ప్రతి హజ్...
By Patan Khuddus 2026-04-19 14:54:31 0 298
Andhra Pradesh
సాధారణ వ్యక్తిలా.. హోటల్లో టిఫిన్ చేసిన బేబినాయన
ప్రజా సేవలో నిత్యం బిజీగా ఉండే ఎమ్మెల్యే బేబినాయన సాధారణ వ్యక్తిలా హోటల్కు వెళ్లి టిఫిన్...
By Boiena Rajesh 2026-03-09 02:13:21 0 198
Delhi - NCR
Delhi Police Arrest 255 in Operation Kavach Drive
Delhi Police arrested 255 alleged drug traffickers during the 14th edition of Operation Kavach, a...
By Navya Sree 2026-06-27 06:33:54 0 62
SURAKSHA
Telangana Retired Police: Service Beyond Retirement Age
Retirement తర్వాత కూడా Telangana Police officers సమాజ సేవలో ముందున్నారు. Blood donation camps లో...
By Kalaga Sailaja 2026-07-03 10:46:16 0 48
Andhra Pradesh
ఇస్రో లో అప్రెంటిస్ ఉద్యోగాలు :
కర్నూలు : ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)కు చెందిన ప్రొపల్షన్ కాంప్లెక్స్,...
By Hari Krishna 2025-12-23 04:39:47 0 188
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com