జనవరి 01, 2026 తెలుగు పంచాంగం.

0
256

శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,

తేదీ ... 01 - 01 - 2026,

వారం ... బృహస్పతివాసరే ( గురువారం )

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,

దక్షిణాయనం,

హేమంత ఋతువు,

పుష్య మాసం,

శుక్ల పక్షం,

తిథి : *త్రయోదశి* రా8.47 వరకు

నక్షత్రం : *రోహిణి* రా9.53 వరకు

యోగం : *శుభం* సా4.34 వరకుకు,

కరణం : *కౌలువ* ఉ9.58 వరకు

తదుపరి *తైతుల* రా8.47 వరకు,

వర్జ్యం : *మ2.26 - 3.5

 మరల *తె3.06 - 4.36* 

దుర్ముహూర్తము : *ఉ10.13 - 10.57*

   మరల *మ2.36 - 3.20*

అమృతకాలం : *సా6.54 - 8.23*

రాహుకాలం : *మ1.30 - 3.00*

యమగండం : *ఉ6.00 - 7.30*

సూర్యరాశి : *ధనుస్సు* 

చంద్రరాశి : *వృషభం*

సూర్యోదయం : 6.34,

సూర్యాస్తమయం : 5.32,

               *_నేటి విశేషం_*

 *ఆంగ్ల నూతన సంవత్సరాది*

ఈనాడు మనము ఒక సంవత్సరమునకు ( తేదీల ప్రకారంగా ) వీడ్కోలు పలికి, మరొక సంవత్సరమునకు స్వాగతము చెబుతున్నాము!!...

దీనినే న్యూ ఇయర్ వేడుకలు అని చెప్పుకుంటున్నాము ...

నిజానికి మనము గ్రహించ వలసినది ఏమిటంటే, మన జీవితంలో ఒక సంవత్సరము కోల్పోయాము అని, ముఖ్యముగా గమనించాలి,

గడిచిన సంవత్సరములో ఏమి చేసాము?, ఏమి సాధించామని లెక్కచూసుకోవాలి...

భగవంతుడు ప్రసాదించిన ఈ విలువైన కాలంలో , ఎంత మందికి నిస్వార్థంగా సేవలు చేశాను, 

నావారు, నా సంసారం, నా బంధువులు అని చూడకుండా ... ఎంతమందికి ఏమి చేశామని ఆలోచించుకోవాలి,

గడిచిన రోజులలో భగవంతుడు నాకిచ్చిన శక్తిలో, నేను ఎంతమంది నిర్భాగ్యుల కడుపులు నింపాను, ఎన్ని దాన ధర్మాలు చేశాను అని ఆలోచించుకోవాలి...

*మరి మనం ఏ అర్హత సాధించాలి??*

మనం ఈరోజు చేస్తున్నది అంతా కేవలం ప్రపంచ వ్యామోహము కానీ , వేరే ఏమీ లేదు, మనం చేయవలసినది భగవంతుని సామ్రాజ్యం లోనికి ప్రవేశించడానికి, తగిన అర్హత పొందాలి...

సంవత్సరం, రావడం పోవడం అనేది, ప్రాకృత మునకు సంబంధించినది...

ఇది సిధ్ధాంతుల ప్రకారం ఈ సంవత్సరం దాటింది, క్రొత్తది వచ్చింది అనే భావన, మనం అనుసరిస్తున్నాము. 

ఇది సత్యం, శాశ్వతం కాదు,

సూర్య చంద్రులు ఎక్కడికీ పోవటం లేదు గనుక, "రాత్రి పగలు" అనేవేలేవు లేవు...

తూర్పు లేదు, పశ్చిమo లేదు, ఇంక సంవత్సరం రావడం పోవడం ఎట్లు జరుగు తుంది, చెప్పండి... 

ఇవన్నీ మానవ స్థాయిలో భ్రమించే భ్రమలు మాత్రమే!!...

మనమంతా, ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయి కి ఎదగాలి!!...

భగవంతునికి రాక పోకలు లేవు, రాక పోకలు లేని చక్రవర్తియే భగవంతుడు...

మానవుడు ఆ అర్హత పొందడానికి తగిన కృషి చేయాలి. 

మనిషి కర్మ చేత బంధింప బడినవాడు కనుక, 

సత్కర్మలు చేయాలి,

పవిత్రమైన పలుకులు పలుకాలి, ప్రేమను పంచాలి, పవిత్రమైన విషయాలు అభివృద్ధి పరచుకోవాలి, 

దాని ద్వారా పవిత్రమైన హృదయమును పొందుతాము, అపుడే మనలో పవిత్రత ఏర్పడుతుంది!!...

ఈరోజు మనం చేస్తున్నది అంతా క్షణికం మాత్రమే, ఈరోజు తిన్నది రేపటికి గుర్తు వుండదు, 

అదే ఆకలి గొన్న వారికి కొంతమందికి పెట్టి చూడు, జీవితం వున్నంత వరకు గుర్తు పెట్టుకొని వుంటారు...

భగవంతుడు కూడా తృప్తి చెందుతారు ... అలాంటి రోజే నిజమైన పండుగ, మన జన్మలో నూతన దినంగా ఆనంద పడాలి.

Search
Categories
Read More
Andhra Pradesh
ఎమ్మార్వో గారు నూతనంగా ప్రారంభించన రేషన్ షాప్
పుంగనూరులోని యూబీ కాంపౌండ్‌లో నూతన రేషన్ షాప్ ప్రారంభోత్సవంలో MROతో పాటు టీడీపీ నాయకులు సీవీ...
By Kothuru Murali 2026-01-02 05:20:47 0 241
Andhra Pradesh
ఫిల్దర్ఫియా ఏజీ చర్చ్ ను సందర్శించిన ఎంపీ కేశినేని శివనాథ్
*ప్ర‌చుర‌ణార్థం* *29-12-2025*   ఫిల‌దెల్ఫియా ఎ.జి చ‌ర్చ్ ను...
By Rajini Kumari 2025-12-29 09:28:05 0 211
Andhra Pradesh
పుంగనూరు: రోడ్డు నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో పుంగనూరు నుంచి బెంగళూరుకు వెళ్లే జాతీయ రహదారిపై గుంతలు పడి...
By Kothuru Murali 2026-04-07 05:49:06 0 206
Sports
Less than 2 hours until Day 2 resumes! 😍 .
Following the footsteps of King Kohli! Captain Shubman Gill scores back-to-back centuries in his...
By Bharat Aawaz 2025-07-03 06:36:55 0 3K
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:కందూరు గ్రామంలో ఘనంగా గంగజాతర: భక్తుల కోలాహలం
అన్నమయ్య జిల్లా సోమల మండలం కందూరు గ్రామంలో ఆదివారం, సోమవారం (15, 16 తేదీలలో) అంగరంగ వైభవంగా...
By Kothuru Murali 2026-03-16 06:53:48 0 223
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com