శిక్షణా కానిస్టేబుల్ లకు దిశా నిర్దేశం చేసిన కర్నూలు ఎస్పీ !!

0
225

కర్నూలు : 
కర్నూలు జిల్లా...

చట్టాల గురించి తెలుసుకోవాలి ... సాంకేతిక వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలి.

ట్రైనీ కానిస్టేబుల్స్ కు దిశా నిర్దేశం చేసిన...
జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు. 

రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి నూతనంగా ఎంపికై, శిక్షణ నిమిత్తం కర్నూలు  జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంకు (డిటిసి)  విచ్చేసిన 205 మంది ఎపిఎస్పీ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్లకు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు బుధవారం దిశా నిర్దేశం చేశారు. 

క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. 

జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం ను  జిల్లా ఎస్పీ గారు పరిశీలించారు.

కర్నూలు  అమిలియో హాస్పిటల్ ఆధ్వర్యంలో ఎపిఎస్పీ ట్రైనీ పోలీసులకు  ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. ముందుజాగ్రత్తలతో టిటి ఇంజెక్షన్ లు వేయించారు. 

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు ట్రైనీ కానిస్టేబుల్ అభ్యర్థులను ఉద్దేశించి మాట్లాడారు. 

శిక్షణ సమయంలో క్రమశిక్షణతో మెలగాలన్నారు. కొత్త కొత్త నేరాలకు అనుగుణంగా పోలీసులు మరింతగా సాంకేతిక వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలన్నారు.

సమన్వయంతో, మానవతా దృక్పథంతో పని చేసి, సమస్యలను పరిష్కరించే విధంగా ఉండాలన్నారు. 

చట్టాల గురించి తెలుసుకోవాలన్నారు. 

శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే ఆ రాష్ట్రం బాగుండి అభివృద్ది చెందుతుందని గౌరవ సిఎం గారు తెలిపారన్నారు. 

కానిస్టేబుళ్ళు క్షేత్ర స్థాయిలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారన్నారు. 

9 నెలల పాటు శిక్షణ లో ఔట్ డోర్, ఇండోర్ శిక్షణతో పాటు టెక్నాలజీ, కమ్యూనికేషన్ స్కిల్స్,  ఆయుధాల వినియోగం  పట్ల శిక్షణ ఇస్తామన్నారు.

మారుతున్న నేరాలకు అనుగుణంగా పోలీసు ఉన్నతాధికారులు శిక్షణ లో మార్పులు చేసారని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 

శిక్షణలో పొందిపర్చిన ప్రతీ అంశం కూడా మిమ్ములను వృత్తిపరంగా నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దేందుకే అని గ్రహించాలన్నారు. 

ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ కోసం అంకితభావంతో పనిచేయాలన్నారు. 

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ / డి టి సి ప్రిన్సిపాల్  శ్రీ హుస్సేన్ పీరా, కర్నూలు డిఎస్పీ బాబు ప్రసాద్, కర్నూలు డిటిసి డిఎస్పీ / వైస్ ప్రిన్సిపాల్ దుర్గ ప్రసాద్, పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్ డాక్టర్ స్రవంతి గారు,  సిఐలు , ఆర్ఐలు , ఎస్సెలు, ఆర్ ఎస్సైలు, ఇతర సిబ్బంది, అమీలియా హాస్పిటల్  వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Search
Categories
Read More
Uttarkhand
Fatal Tempo Traveler Crash on Badrinath Highway; Alaknanda River Search Continues
Tragedy struck the Char Dham pilgrimage in Uttarakhand yesterday with multiple fatal road...
By Tejaswini Komanduru 2026-06-05 08:38:59 0 606
Odisha
Odisha Industrial and Economic Growth: Latest Developments
Odisha has emerged as one of India’s leading industrial hubs, driven by strong growth in...
By Fathima Safa 2026-06-25 07:05:50 0 66
SURAKSHA
Narayan Konwar, IAS: A Pillar of Assam's Governance
The Journey Begins "Effective governance is built on integrity, accountability, and the...
By Fathima Safa 2026-07-22 13:37:01 0 20
Andhra Pradesh
యువతకు భరోసా టీడీపీ పాలనలోనే సాధ్యం ఐటిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి జి నాగేంద్ర నాయుడు
రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రకటించిన పదివేల 600 ఉద్యోగాలతో కూడిన మెగా జాబ్...
By Benguluri Madhubabu 2026-03-20 11:13:09 0 235
Andhra Pradesh
పుంగనూరు మార్కెట్ యార్డులో అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను...
By Benguluri Madhubabu 2026-03-08 13:19:01 0 179
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com