లింగ నిర్దారణ చట్టం జిల్లా స్థాయి సమావేశం

0
201

కలెక్టర్ కార్యాలయం నందు గర్భస్థ లింగ నిర్ధారణ చట్టము మరియు ఏఆర్టి /సరోగసి జిల్లా స్థాయి సమావేశము జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సరియా మరియు జిల్లా మ్యాజిస్ట్రేట్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశంలో పాల్గొన్న డాక్టర్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కె విజయ లక్ష్మి మాట్లాడుతూ ఈ సమావేశమునకు 8 - కొత్త స్కాన్ సెంటర్ల రిజిస్ట్రేషన్,14 రెన్యువల్ రిజిస్ట్రేషన్, 2- ఏ ఆర్ టి, 1- సరోగసి దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఈ సెంటర్లను తను మరియు ప్రోగ్రాం ఆఫీసర్లు సందర్శించి, తనిఖీ చేసి ఆమోదం కోసం మీటింగ్లో పెట్టడం జరిగిందని తెలియజేసినారు. సి.హెచ్. వెంకట నాగ శ్రీనివాసరావు, 3వ అడిషనల్ డిస్టిక్ జడ్జి మరియు 2- వ జిల్లా ఎడిషనల్ జడ్జ్ ఇంచార్జ్ మాట్లాడుతూ ఫిబ్రవరి మీటింగులో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా క్రొత్త స్కానింగ్ సెంటర్లను సందర్శిస్తానని తెలియజేసినారు. కలెక్టర్ మాట్లాడుతూ చట్టం ఉల్లంఘన జరగకుండా చూడవలసిన బాధ్యత, జిల్లా అధికారులపై ఉందని, ఈ సమావేశమునకు వచ్చిన దరఖాస్తులను ఆమోదిస్తున్నట్టు తెలియజేసినారు. ఈ సమావేశము నందు కమిటీ సభ్యులు డాక్టర్ ఎ శ్రావణ్ బాబు జిల్లా వ్యాధి నిరోధక టీకాలు అధికారి, డాక్టర్ అనిత ప్రగతి ఐవిఎఫ్ యూనిట్, అరుణ ఐద్వా ఎన్జీవో, ప్రసూన పిడి ఐసిడిఎస్, శ్రీనివాసరెడ్డి డి.ఎస్.పి మహిళ పోలీస్ స్టేషన్, ఫణి రాజేంద్ర,సీడ్స్, ఎన్ వెంకటేశ్వర్లు డిప్యూటీ డెమో, ఇస్మాయిల్ హెల్త్ ఎడ్యూకేటర్, వాణి,మానిటరింగ్ కన్సల్టెంట్ పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
లక్షేటిపేట: చైనా మాంజా వాడితే కేసులు తప్పవు
లక్షెట్టిపేటలో చైనా మాంజా విక్రయాలు, వాడకంపై ఎస్ఐ గోపతి రమేష్ కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు....
By Pinnehasan Odela 2026-01-10 13:20:44 0 251
SURAKSHA
Lhari Dorjee Lhatoo: A Guardian of Duty and Discipline
Leading Manipur Police with Courage, Integrity and Vision Profile at a Glance "A police...
By Lokeshwari Panthadi 2026-07-22 10:12:52 0 125
Ladakh
Tourism Development and Sustainable Eco-Tourism Plans
Ladakh is actively promoting tourism development while emphasizing sustainable eco-tourism...
By Fathima Safa 2026-06-24 09:53:29 0 199
Andhra Pradesh
వెదుళ్ళపల్లి సెంటర్ వద్ద బోల్తా పడిన గడ్డివాము ట్రాక్టర్ * ప్రమాదకరంగా మారుతున్న అధికంగా లోడ్ వాహనాలు
బాపట్ల జిల్లా పరిధిలోని వెదుళ్ళపల్లి సెంటర్ వద్ద గురువారం ఒక ప్రమాదం చోటుచేసుకుంది. గడ్డివాముతో...
By Vadlamudi NagaVenkat 2026-03-12 14:34:41 0 1K
SURAKSHA
Architect of Change: The Visionary Legacy of Dr. Ajay Kumar, IAS
Shaping India’s Future: How a Technocrat Bureaucrat Transformed National Defense and...
By Kalaga Sailaja 2026-07-20 08:28:13 0 456
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com