ఉచిత సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ 9 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల పిల్లల వరకు సద్వినియోగం చేసుకోండి డాక్టర్ సుధ డిసెంబర్ 31 సాయంత్రం లోపు నమోదు చేసుకోండి రామకృష్ణ వివేకానంద రెడ్డి

0
255

*తాడేపల్లి*

 

*ఉచిత సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ ని 9 నుంచి 15 సంవత్సరాల లోపు బాలికలు సద్వినియోగం చేసుకోండి: డాక్టర్ సుధా*

 

*డిసెంబర్ 31 సాయంత్రం లోపు నమోదు చేసుకొండి: రామకృష్ణ, వివేకానంద రెడ్డి,*

 

రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ శక్తి అనే పేరుతో 9 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల లోపు ఉన్న బాలికలకు గర్భాశయ క్యాన్సర్ నిరోధక వ్యాక్సిన్ ను పూర్తిగా ఉచితంగా అందించడం జరుగుతోందని రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి అధ్యక్షులు శెట్టి రామకృష్ణ,ఫాస్ట్ ప్రెసిడెంట్ మున్నంగి వివేకానంద రెడ్డి అన్నారు.మంగళవారం తాడేపల్లి 

కె.వి.ఆర్.జడ్.హై స్కూల్, సీతానగరం,రామకృష్ణ మిషన్ హై స్కూల్, మహానాడు నేతాజీ స్కూల్,

చిర్రావూరు ప్రభుత్వ పాఠశాలలో బాలికలకు (విద్యార్థులకు) డాక్టర్ సుధా,డాక్టర్ స్వాతి చందన,డాక్టర్

కూచిపూడి మనోజ్ఞ,అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ శక్తి పేరుతో అందిస్తున్న ఈ ఉచిత సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ను తల్లిదండ్రుల అనుమతితో 9 నుంచి 15 సంవత్సరాలలోపు ప్రతి బాలిక సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని అన్నారు. రోటరీ ప్రతినిధులు మాట్లాడుతూ ఉచిత సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ ను పేరు నమోదుచేయించుకునేందుకు డిసెంబర్ 31వ తేదీలోపు సంప్రదించాలని కోరారు. వివరాలకు కోసం ఈ క్రింది నంబర్స్ ని 9948074365,9703934444,

9032331199,8466812222, సంప్రదించవచ్చు అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అఫ్ తాడేపల్లి ప్రతి నిధులు పలగాని శ్రీకాంత్,జొన్న రాజేష్,కాట్రగడ్డ 

శివన్నారాయణ,రమేష్,శెట్టి 

కేశవరావు,సూర్యనారాయణ,

స్కూలు ఉపాధ్యాయులు ప్రసాద్, వీరాంజనేయులు,సుజాత,శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి: బొబ్బిలి ఎమ్మెల్యే
తెర్లాం మండలంలోని గోపాలవలస, జగన్నాథవలస, సతివాడ రోడ్లు దుర్భరంగా ఉన్నాయని వాటి నిర్మాణానికి నిధులు...
By Boiena Rajesh 2026-02-25 06:25:27 0 456
Andhra Pradesh
పుంగనూరులో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
పుంగనూరులో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా...
By Kothuru Murali 2026-04-15 07:19:15 0 160
Andhra Pradesh
వేటపాలెంలో అకస్మాత్తుగా తనిఖీలు చేసిన పోలీసులు.
నేడు వేటపాలెం మండలంలోని కొనిజేటి నగర్ కాలనీలో బాపట్ల జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు చీరాల డిఎస్పీ...
By Vadlamudi NagaVenkat 2026-03-05 07:27:56 1 589
SURAKSHA
Shri Robin Hibu, IPS: Inspiring Lives Through Service and Leadership
A distinguished IPS officer whose fearless policing, compassionate leadership, and unwavering...
By Kalaga Sailaja 2026-07-28 10:33:24 0 118
Andhra Pradesh
ఆర్‌ ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ నరసరావు పేట లో ఉచిత మెగా మెడికల్ క్యాంపు
ఆర్‌ ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ నరసరావు పేట లో ఉచిత మెగా మెడికల్ క్యాంపు ...
By Chennaiah Kati 2026-06-18 13:12:31 0 115
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com