అయ్యో నా పతి దేవుడు గుండెపోటుతో చనిపోయాడని బోరుమంది.. కట్ చేస్తే..

0
304

గుండెపోటు ముసుగులో జరిగిన హత్యను మేడిపల్లి పోలీసులు ఛేదించారు. భర్తను ఉరివేసి హత్య చేసిన భార్యతో పాటు ఆమె సహచరులను అరెస్టు చేశారు. బోడుప్పల్‌లో జరిగిన ఈ సంచలన కేసులో వివాహేతర సంబంధమే హత్యకు కారణమని దర్యాప్తులో తేలింది. సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలతో నిజాన్ని బయటపెట్టిన పోలీసులు ముగ్గురు నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి పంపించారు.

 

రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీసులు అత్యంత పక్కా దర్యాప్తుతో ఓ సంచలన హత్య కేసును ఛేదించారు. భర్తను ఉరివేసి హత్య చేసిన భార్యతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. మొదట గుండెపోటుగా చిత్రీకరించిన ఈ ఘటన వెనుక వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు తేల్చారు. బోడుప్పల్ ఈస్ట్ బృందావన్ కాలనీలో నివాసం ఉంటున్న వి.జె. అశోక్ (45) హత్య కేసులో అతని భార్య జె. పూర్ణిమ (36)తో పాటు ఆమె సహచరులు పలేటి మహేష్ (22), భుక్య సాయి కుమార్ (22)లను పోలీసులు అరెస్టు చేశారు. డిసెంబర్ 12న పూర్ణిమ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. తన భర్త అశోక్ ఇంట్లోని బాత్రూమ్‌లో అపస్మారక స్థితిలో కనిపించాడని, మల్కాజిగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారని తెలిపింది. మొదట ఎలాంటి అనుమానం వ్యక్తం చేయకపోవడంతో పోలీసులు సాధారణ కేసుగా నమోదు చేశారు. కానీ మృతదేహాన్ని పరిశీలించినప్పుడు చెంప, మెడపై గాయాలు, విరిగిన పళ్లు కనిపించడంతో పోలీసులు లోతైన దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు కేసును కీలక మలుపు తిప్పాయి. దర్యాప్తులో పూర్ణిమకు అదే కాలనీలో గతంలో నివసించిన పలేటి మహేష్‌తో వివాహేతర సంబంధం ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న అశోక్ భార్యను ప్రశ్నించడం ప్రారంభించాడు. దీంతో భర్తను అంతమొందించాలని పూర్ణిమ నిర్ణయించుకుంది. ఈ హత్యకు భుక్య సాయి కుమార్ సహాయం తీసుకున్నారు. ముందుగా పక్కా ప్రణాళిక రూపొందించి అమలు చేశారు.

 

డిసెంబర్ 11 సాయంత్రం 6.15 గంటల సమయంలో అశోక్ పని ముగించుకుని ఇంటికి వచ్చిన వెంటనే మహేష్, సాయి కలిసి అతడిని పట్టుకున్నారు. అదే సమయంలో పూర్ణిమ అతని కాళ్లు పట్టుకుంది. మహేష్ చున్నీలతో అశోక్‌కు ఉరి బిగించి హత్య చేశాడు. హత్య అనంతరం మృతుడి బట్టలు మార్చి, రక్తపు మరకలున్న వస్తువులు తొలగించి, ఆధారాలు నాశనం చేసే ప్రయత్నం చేశారు. గుండెపోటుతో మృతి చెందాడంటూ బంధువులను తప్పుదోవ పట్టించారు. పోలీసులు నిందితుల నుంచి.. రక్తపు మరకలున్న మూడు చున్నీలు, రక్తపు మరకలున్న బట్టలు.. హత్యకు సంబంధించిన ఫోటోలు, వీడియోలున్న పెన్‌డ్రైవ్, ఐఫోన్–15, బైక్ స్వాధీనం చేసుకున్నారు. మొదట నమోదు చేసిన కేసును సెక్షన్ 194 BNS నుంచి 103(1), 238 r/w 3(5) BNS సెక్షన్ల కిందకు మార్చారు. ముగ్గురు నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేశారు. శాస్త్రీయ, ఫోరెన్సిక్ ఆధారాలతో కేసును బలపరుస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

 

#Sivanagendra #Trending #News #Bharathaawaz 

Search
Categories
Read More
Bharat Aawaz
Panchayat Elections in Telangana: It's Not Just a Vote – It's a Voice for Your Village
In every election, we talk about leaders in Delhi or Hyderabad. But real change — the kind...
By Bharat Aawaz 2025-06-25 10:14:58 0 2K
Telangana
జూన్ 16 నుండి 28 వరకు హైదరాబాద్లో రగ్బీ ప్రీమియర్ లీగ్ పోటీల నిర్వహణ : అధ్యక్షులు నరేంద్ర రామ్ నంబూల
హైదరాబాద్ : హైదరాబాద్‌లోని గచ్చిబౌలి బాలయోగి అథ్లెటిక్స్  స్టేడియంలో జూన్ 16 నుండి 28...
By Avunoori Mahesh 2026-06-14 10:20:48 0 346
Andhra Pradesh
నంద్యాల జిల్లా బనగానపల్లిలో నిర్వహించిన "మీ భూమి – మీ హక్కు" కార్యక్రమం
నంద్యాల జిల్లా బనగానపల్లిలో నిర్వహించిన "మీ భూమి – మీ హక్కు" కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన...
By Chennaiah Kati 2026-07-09 15:19:23 1 129
Andhra Pradesh
కారులో ఫోటోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ – దర్శకుడిపై కేసు
కాకినాడకు చెందిన 23 ఏళ్ల యువతిని వెబ్ సిరీస్‌లో అవకాశం కల్పిస్తానని నమ్మించి మోసం చేసిన ఘటన...
By Ratna Sekhar 2026-03-08 17:37:15 0 1K
Telangana
బస్తీ సమస్యల పరిష్కారమే లక్ష్యం. |
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ 134 డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి,...
By Sidhu Maroju 2026-01-12 07:36:29 0 257
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com