పెన్షన్ స్కీమ్‌లో గుడ్ న్యూస్.. 100% విత్‌డ్రా అవకాశం |

0
31

EPFO (Employees’ Provident Fund Organisation) 2025లో పెన్షన్ స్కీమ్‌పై కీలక మార్పులు చేసింది. తాజా నిబంధనల ప్రకారం, సభ్యులు తమ EPF ఖాతాలో ఉన్న మొత్తంలో 100% వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశం పొందారు.

 

అయితే కనీసం 25% corpus ఖాతాలో ఉండాల్సిందే. ఉద్యోగం కోల్పోయిన తర్వాత EPF సెటిల్‌మెంట్ గడువు 12 నెలలకు, EPS (పెన్షన్) సెటిల్‌మెంట్ గడువు 36 నెలలకు పెంచారు. EPS ఖాతాదారులకు డిజిటల్, పారదర్శక విధానాలు అమలు చేయనున్నారు. 

 

అసలు జీతంపై కాంట్రిబ్యూషన్ చేసిన ఉద్యోగులకు హయ్యర్ పెన్షన్ అర్హత కూడా స్పష్టత ఇచ్చారు. ఈ మార్పులు ఉద్యోగుల భవిష్యత్‌ ఆర్థిక భద్రతకు దోహదపడతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com