ఇవాళ తులం రూ.3,280 పెరిగిన బంగారం ధర |

0
26

అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న అనిశ్చిత పరిస్థితులు, వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాల నేపథ్యంలో హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరాయి.

 

అక్టోబర్ 14న 24 క్యారెట్ల బంగారం ధర తులానికి రూ.3,280 పెరిగి రూ.1,28,680కి చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,17,950గా ఉంది. వెండి ధర కేజీకి ఏకంగా రూ.9,000 పెరిగి రూ.2,06,000కి చేరింది. దీపావళి సమీపిస్తున్న నేపథ్యంలో కొనుగోలుదారులు బంగారం, వెండి కొనుగోళ్లపై ఆసక్తి చూపుతున్నారు.

 

నిపుణులు దీన్ని “సేఫ్ హేవెన్ ఇన్వెస్ట్‌మెంట్”గా అభివర్ణిస్తున్నారు. దీపావళి తర్వాత ధరలు కొంత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com