9 నెలల్లో నాలాల పునరుద్ధరణ ప్రక్రియ పూర్తి |

0
24

హైదరాబాద్‌లో వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన, వరదలకు చెరువుల కాకుండా నాలాల ఆక్రమణలే ప్రధాన కారణమని స్పష్టం చేశారు.

 

నగరవ్యాప్తంగా నాలాలపై అక్రమ నిర్మాణాలను తొలగించే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. త్వరలోనే నాలాల పునరుద్ధరణకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తామని, 9 నెలల్లో ఈ ప్రక్రియను పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. 

 

హైడ్రా ద్వారా ఇప్పటివరకు కాపాడిన ప్రభుత్వ ఆస్తుల విలువ రూ.50 వేల కోట్లకు పైగా ఉందని వెల్లడించారు. ఈ చర్యలతో నగరంలో వరదల తీవ్రత తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com