చిరు వ్యాపారులకు చంద్రబాబు నూతన ఆశల బాట |

0
31

నెల్లూరు జిల్లాలో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా విశ్వసముద్ర బయో ఇథనాల్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ ప్లాంట్‌ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి కీలకంగా నిలవనుంది.

 

అలాగే నెల్లూరు నగరంలో స్మార్ట్‌ స్ట్రీట్‌ బజార్‌ను ప్రారంభించనున్నారు. రూ.8.40 కోట్లతో 200 షాపులు మంజూరు చేసిన ప్రభుత్వం, తొలి విడతలో 120 షాపులను సిద్ధం చేసింది.

 

చిరు వ్యాపారులకు ఆధునిక వసతులతో కూడిన మార్కెట్‌ను అందించాలన్న లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టారు. ఈ పర్యటన నెల్లూరు జిల్లాలో పారిశ్రామిక, సామాజిక అభివృద్ధికి కొత్త దిశను సూచిస్తోంది.

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com