Bharat Aawaz

విద్యారంగ అభివృద్ధికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ చేసిన సేవలు మరువలేనివి.

Mahidhar Naidu
Verified User
BMA | BHARAT AAWAZ Member
4 min read
0
Comments
3
Views

విద్యారంగ అభివృద్ధికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ చేసిన సేవలు మరువలేనివి

 

కొత్తగూడెం కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా జయంతి వేడుకలు

 

గౌస్ మొయినుద్దీన్ ఆధ్వర్యంలో నివాళులు.. ముఖ్య అతిథులుగా జేబీ శౌరి, తూము చౌదరి

 

కొత్తగూడెం: భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. డీసీసీ జిల్లా కార్యదర్శి గౌస్ మొయినుద్దీన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి టీపీసీసీ సభ్యులు జేబీ శౌరి, కాంగ్రెస్ నాయకులు తూము చౌదరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి, కేక్ కట్ చేసి జయంతి వేడుకలు జరుపుకున్నారు.

 

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ కీలక పాత్ర పోషించారని, స్వాతంత్ర్యం అనంతరం దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా విద్యారంగ అభివృద్ధికి విశేష కృషి చేశారని తెలిపారు. విద్య ద్వారానే సమాజంలో మార్పు, సమానత్వం, దేశాభివృద్ధి సాధ్యమని విశ్వసించి విద్యావ్యవస్థ బలోపేతానికి పునాదులు వేశారని పేర్కొన్నారు.

 

ముఖ్యంగా బాలికల విద్యకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, 14 సంవత్సరాల లోపు బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ విద్య అందించాలనే లక్ష్యంతో కృషి చేశారని గుర్తుచేశారు. విద్యా అవకాశాలు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలనే ఆయన ఆలోచనలు నేటికీ ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్నాయని అన్నారు.

 

స్వాతంత్ర్య పోరాటంలో ఆయన చేసిన త్యాగాలు, దేశ విద్యారంగానికి అందించిన సేవలు భావితరాలకు ఆదర్శంగా నిలుస్తాయని నాయకులు పేర్కొన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ విద్యాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

 

ఈ కార్యక్రమంలో ఓబీసీ జిల్లా అధ్యక్షుడు అల్లాడి నరసింహారావు, జిల్లా మైనార్టీ నాయకుడు ఎం.డి. గౌస్ పాషా, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు ఎం.డి. ఆరిఫ్ ఖాన్, జిల్లా మైనార్టీ వైస్ ప్రెసిడెంట్ కరీం పాషా, మైనార్టీ టౌన్ జనరల్ సెక్రటరీ కమర్, మైనార్టీ నాయకులు ఎస్.కె. చాంద్ పాషా, సీనియర్ కాంగ్రెస్ మహిళా నాయకురాలు హుస్సేన్ బీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు దుర్గారాశి సమ్మయ్య, టైలర్ నరసయ్య, ఏలేటి వెంకటేశ్వర్లు, సీతారాములు, సుమన్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.