Bharat Aawaz

68 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ మందమర్రి అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు.. 1,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి చర్యలు

Avunoori Mahesh
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
3 min read
0
Comments
51
Views

మందమర్రి: మందమర్రి బి-1 క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద మంజూరైన చెక్కులను రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలు, గనులు, భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మొత్తం 68 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.అనంతరం మంత్రి మాట్లాడుతూ మందమర్రి పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోందని తెలిపారు. సింగరేణి భూమిని సేకరించి సుమారు 1,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. పట్టణంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్, 50 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.అలాగే పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సౌకర్యాల అభివృద్ధికి పనులు చేపడుతున్నామని వివరించారు.స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కొత్త మైన్ ఏర్పాటు, ఏటీసీ ద్వారా నైపుణ్య శిక్షణతో పాటు జర్మన్ భాషలో శిక్షణ అందించే కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. మందమర్రి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.