0
Comments
16
Views
చింతూరు మండలం కేంద్రంలో ఈరోజు ఉదయం 7 గంటల నుండి ఓటింగ్ ప్రారంభం అయ్యింది. ఉదయమే తమ ఓటు వినియోగించుకునేందుకు ఓటర్లు ఆసక్తి చూపిస్తూ పోలింగ్ కేంద్రానికి వెళ్తున్నారు, నిన్నటివరకు తుఫాను కారణంగా ప్రజలు బయటికి రాలేని పరిస్థితి ఈ రోజు వర్షం లేకుండా పూర్తిగా మబ్బులు కమ్మి ఉండటం వలన ఓటర్లకు వాతావరణం అనుకూలంగా ఉండడం వలన ఉదయం నుండి పోలింగ్ కేంద్రాల్లో క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. అనేకమంది ఎంపిటిసి, జడ్పీటీసీ పోటీచేసిన అభ్యర్థులు తమ ఓటు హక్కును అందరికంటే ముందే వినియోగించి ఓటర్లను పోలింగ్ కేంద్రాల వైపు నడిపిస్తున్నారు.
# Yadagiri