Bharat Aawaz

బురఖా ధరించి రెక్కీ.. బ్యాగులో కటింగ్ మిషన్.. రూ.70 లక్షల సొత్తు అపహరణ

Shaik Baba
Verified User
BMA | BHARAT AAWAZ Member
2 min read
0
Comments
79
Views

బాధితుడి ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా, బురఖా ధరించి బ్యాగుతో ఇంట్లోకి ప్రవేశించి కొంతసేపటి తర్వాత బయటకు వెళ్తున్న మహిళ దృశ్యాలు లభించాయి.

విచారణలో జయ నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.

విద్యాభ్యాసం మధ్యలోనే నిలిపివేత..

నిందితురాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అనుబోస్ కళాశాలలో బీటెక్ చదువుతూ కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువును మధ్యలోనే నిలిపివేసినట్లు సమాచారం. అనంతరం వివాహం చేసుకుని 2024లో భర్తతో కలిసి హైదరాబాద్‌కు వచ్చి ఉప్పల్‌లోని న్యూ భారత్ నగర్‌లో నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు.

పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో తాళం వేసి ఉన్న ఇళ్ల యజమానులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు.