Bharat Aawaz

ఒకరి రక్తం. మరొకరికి జీవం ఎస్పీ నితిక పంత్

Chunarkar Jagadeesh
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
2 min read
0
Comments
88
Views

🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్:  దేశ రక్షణ, ప్రజా భద్రత కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి విధి నిర్వహణలో వీరమరణం పొందిన అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితిక పంత్ కొనియాడారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో శనివారం భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ నితిక పంత్ మాట్లాడుతూ. దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో 155 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రాణత్యాగం చేశారని గుర్తుచేశారు. వారి పవిత్ర స్మృత్యర్థం ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒక్క యూనిట్ రక్తం. ఒక నిండు ప్రాణాన్ని కాపాడుతుంది అని, అత్యవసర సమయాల్లో రక్తం అందక ఎవరూ ప్రాణాలు కోల్పోకూడదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు 

యువతకు పిలుపు: సామాజిక సేవా కార్యక్రమాల్లో యువత మరింత చురుగ్గా పాల్గొనాలని, రక్తదానం చేయడం ద్వారా మరొకరికి పునర్జన్మ ప్రసాదించిన వారవుతారని ఎస్పీ పేర్కొన్నారు. ఈ శిబిరంలో పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు పెద్ద సంఖ్యలో యువకులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ ఉన్నతాధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.