Bharat Aawaz

మల్కాజ్‌గిరి అభివృద్ధికి ఎమ్మెల్యే మర్రి ప్రత్యేక చొరవ.. కమిషనర్‌కు వినతులు.|

Sidhu Maroju
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
3 min read
0
Comments
186
Views

● పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రతిపాదనలు

● రహదారులు, చెరువులు, ఫైర్ స్టేషన్ నిర్మాణంపై వినతులు

● క్రీడా మైదానాలు, పార్కులు, డ్రైనేజీ అభివృద్ధికి నిధుల విడుదల కోరిన ఎమ్మెల్యే

అల్వాల్,అక్టోబర్30:మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన వసతుల కల్పనే లక్ష్యంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి శుక్రవారం MMC కమిషనర్ టీ. వినయ్ కృష్ణారెడ్డి, IASను మర్యాదపూర్వకంగా కలిసి పలు అభివృద్ధి పనులకు సంబంధించిన వినతిపత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా అల్వాల్ ఫైర్ స్టేషన్ నిర్మాణం, CRMP రహదారులు, AOC పరిధిలో అదనపు రహదారుల ఏర్పాటు, సఫిల్‌గూడ LHS, నేరేడ్‌మెట్ కమ్యూనిటీ స్థలం, కౌకూర్ ఫైర్ రేంజ్ సమీపంలోని సమస్యలు, మచ్చబొల్లారం డంపింగ్ యార్డ్, యాప్రాల్ జంక్షన్ అభివృద్ధి, చిన్నరాయుని చెరువు, బండ చెరువు అభివృద్ధి తదితర అంశాలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.

అదేవిధంగా RK పురం ఫుట్‌బాల్ గ్రౌండ్, డిఫెన్స్ కాలనీ బ్యాడ్మింటన్ కోర్టు, మౌలాలి స్విమ్మింగ్ పూల్ నిర్మాణాలకు ఇప్పటికే మంజూరైన నిధుల విడుదలతో పాటు నియోజకవర్గంలోని సీసీ రోడ్లు, బాక్స్ డ్రైన్లు, పార్కులు, ఓపెన్ జిమ్‌లు, స్మశాన వాటికల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను సమర్పించారు.

ఎమ్మెల్యే అందజేసిన వినతులపై కమిషనర్ సానుకూలంగా స్పందించారు. సంబంధిత అధికారులతో చర్చించి, ఆయా అభివృద్ధి పనుల అమలుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

#Sidhumaroju

Alwal