Bharat Aawaz

HMT నగర్ పెద్ద చెరువు అభివృద్ధి పనులు ముమ్మరం

Shaik Baba
Verified User
BMA | BHARAT AAWAZ Member
3 min read
0
Comments
124
Views

50 శాతం పనులు పూర్తి.. నిరంతరంగా కొనసాగుతున్న పనులు

పనుల పురోగతిని పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు

హెచ్‌ఎంటీ నగర్, నాచారం:

ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని HMT నగర్ పెద్ద చెరువు అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. హైడ్రా కమిషనర్ శ్రీ ఏ.వి. రంగనాథ్ పర్యవేక్షణలో చేపట్టిన చెరువు అభివృద్ధి పనుల పురోగతిని కాంగ్రెస్ పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా పనులు జరుగుతున్న తీరును, ఇప్పటివరకు పూర్తయిన పనులను, మిగిలి ఉన్న పనుల వివరాలను నాయకులు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న సైట్ ఇంజినీర్ వివరాల ప్రకారం, ఇప్పటివరకు సుమారు 50 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు పగలు, రాత్రి తేడా లేకుండా నిరంతరంగా పనులు కొనసాగిస్తున్నట్లు ఇంజినీర్ వెల్లడించారు.

చెరువు అభివృద్ధి పనులు పూర్తయితే పరిసర ప్రాంత ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందుబాటులోకి రావడంతో పాటు, చెరువు సుందరీకరణకు మరింత ప్రాధాన్యత లభించనుంది. చెరువు పరిరక్షణ, పరిసరాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సౌకర్యాల కల్పన దిశగా చేపడుతున్న ఈ పనులను నిర్ణీత సమయంలో నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు.

ప్రజల ఆశలు నెరవేరేలా పనులు వేగవంతంగా కొనసాగుతుండటంతో HMT నగర్ పెద్ద చెరువు అభివృద్ధిపై స్థానికుల్లో ఆసక్తి నెలకొంది.