Bharat Aawaz

కొత్త ఖాజీ నియామకాన్ని నిలిపివేయాలని డిమాండ్: ఆసిఫాబాద్‌లో ముస్లిం మత పెద్దల ఆగ్రహం

Chunarkar Jagadeesh
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
2 min read
0
Comments
101
Views

🎤ఆసిఫాబాద్, (భారత్ఆ వాజ్ ప్రతినిధి): ఆసిఫాబాద్ పట్టణంలో కొత్త ఖాజీ నియామక వివాదం తీవ్ర రూపం దాల్చింది. కొత్తగా చేపడుతున్న ఖాజీ నియామక ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక జామా మసీదు వద్ద ముస్లిం మత పెద్దలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేశారు.

గత 1992వ సంవత్సరం నుండి ఇక్కడ నిరంతరాయంగా సేవలు అందిస్తున్న పాత ఖాజీ అబ్దుస్సలాంనే యథావిధిగా ఆ పదవిలో కొనసాగించాలని వారు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. తమకు ఎలాంటి ముందస్తు సమాచారం కానీ, అవగాహన కానీ లేకుండా మరొక వ్యక్తి ఖాజాయత్ బాధ్యతలను దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మత పెద్దలు తీవ్రంగా ఆరోపించారు.

తరతరాలుగా సంప్రదాయబద్ధంగా వస్తున్న పాత ఖాజీకే పూర్తి బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం వెంటనే అధికారిక ఉత్తర్వులు జారీ చేయాలని వారు కోరారు. లేనిపక్షంలో తమ నిరసనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.