Bharat Aawaz

విద్యార్థులకు భద్రతపై అవగాహన.. SHE Teams ముందడుగు.|

Sidhu Maroju
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
2 min read
0
Comments
188
Views

● మహిళలు, చిన్నారుల రక్షణపై SHE Teams అవగాహన కార్యక్రమం

● సైబర్ నేరాలు, లోన్ యాప్ మోసాలపై విద్యార్థులకు సూచనలు

అల్వాల్, అక్టోబర్ 29: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జవహర్‌నగర్ SHE Teams ఆధ్వర్యంలో బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్లాడ్ ఫార్మా లిమిటెడ్ జెడ్పీహెచ్‌ఎస్‌లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 

మహిళలు, చిన్నారుల భద్రత, చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు ఆపద సమయాల్లో తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.

SHE Teams సేవలు, గుడ్ టచ్‌–బ్యాడ్ టచ్, బాలలపై వేధింపులు, మానవ అక్రమ రవాణా, బాల్యవివాహాలు, లింగ సమానత్వం, సీసీ కెమెరాల ప్రాధాన్యం, సైబర్ నేరాలు, లోన్ యాప్ మోసాలు, ర్యాగింగ్ నిరోధం వంటి అంశాలను వివరించారు. ఆయా అంశాలకు సంబంధించిన కేసుల ఉదాహరణలతో విద్యార్థులకు అవగాహన కల్పించారు.

అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల సహాయం కోసం 112 నంబర్‌కు కాల్ చేయాలని, మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ వాట్సాప్ హెల్ప్‌లైన్ 8712662111ను సంప్రదించాలని సూచించారు.

#Sidhumaroju

Alwal