Bharat Aawaz

పలాస వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా బమ్మిడి దుర్యోధన రావు (B.D. RAO) ప్రకటన

Konchada Ravi
Verified User
BMA | BHARAT AAWAZ Member
4 min read
0
Comments
98
Views

పలాస వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా బమ్మిడి దుర్యోధన రావు (B.D. RAO) ప్రకటన

  • వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్ఫూర్తితో, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆశీస్సులతో ప్రజాక్షేత్రంలోకి...
  • పదవి కోసం కాదు.. నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసమే రాజకీయం
  • అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షమే నా పక్షం: బీడీ రావు స్పష్టీకరణ

 

పలాస: పలాస మండల సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థిగా బమ్మిడి దుర్యోధన రావు (B.D. RAO) అధికారికంగా ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమ పాలన స్ఫూర్తితో, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆశీస్సులతో తాను ఈ ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

ఈ సందర్భంగా దుర్యోధన రావు మాట్లాడుతూ, తాను పదవుల కోసం కాకుండా ప్రజలకు అండగా నిలవడానికే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. స్థానిక ప్రజల కష్టసుఖాలు, మండల సమస్యలు తెలిసిన వాడిగా ఎల్లప్పుడూ క్షేత్రస్థాయిలోనే ఉంటూ సేవలందిస్తానని హామీ ఇచ్చారు.

 

ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం

"రాజకీయాలు అంటే కేవలం ఎన్నికల సమయానికే పరిమితం కాకూడదు. మాటలతో కాకుండా చేతలతో ప్రజలకు భరోసా ఇవ్వాలన్నదే నా తపన. అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. నేను మాత్రం ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యలపై రాజీలేని గొంతుకగా ఉంటాను" అని దుర్యోధన రావు పేర్కొన్నారు. పలాస మండలంలోని ప్రతి గ్రామం, ప్రతి వార్డులో తాగునీరు, డ్రైనేజీ, మౌలిక వసతులు, రైతులు, కార్మికుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు.

 

ముఖ్య వ్యాఖ్యలు:

  • "ప్రజలే నా బలం – ప్రజాసేవే నా ధ్యేయం"
  • "రాజకీయాల కోసం కాదు.. ప్రజా సంక్షేమం కోసమే నా ప్రయాణం"
  • "మీ ఆశీర్వాదం నా బలం, మీ నమ్మకం నా బాధ్యత, సమస్యల పరిష్కారం నా ఏకైక లక్ష్యం"

 

కార్యకర్తల్లో నూతన ఉత్సాహం

బమ్మిడి దుర్యోధన రావు అభ్యర్థిత్వాన్ని ప్రకటించడంతో పలాస మండలంలోని వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. క్షేత్రస్థాయిలో ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండటం, నాయకత్వ లక్షణాలు ఉండటంతో మండల వ్యాప్తంగా ప్రజల నుంచి, పార్టీ వర్గాల నుంచి ఆయనకు విశేష మద్దతు లభిస్తోంది. పలాస అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి ప్రజలందరూ ఆశీర్వదించాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.