Bharat Aawaz

Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డాక్టర్ అప్సర్ షరీఫ్ నామినేషన్ దాఖలు చేశారు.

Pagadala Venkateswar
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
2 min read
0
Comments
80
Views

Madanapalle: మదనపల్లె మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల చివరి రోజైన ఆదివారం కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా సీనియర్ నాయకుడు డాక్టర్ అప్సర్ షరీఫ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు అధికమవడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గత ప్రభుత్వాలు మదనపల్లె పట్టణ అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం కల్పిస్తే పట్టణ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీ క్రమంగా బలపడుతోందని, 2029 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయం సాధించి రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.