Bharat Aawaz

Madanapalle: మదనపల్లెలో ప్రేమ వివాహం చేసుకున్న యువకుడిపై కానిస్టేబుల్ దాడి చేశాడన్న ఆరోపణలతో అతడు మిద్దెపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది.

Pagadala Venkateswar
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
78
Views

 

 ఆ సమయంలో కానిస్టేబుల్ రవి నాయక్ జోక్యం చేసుకుని నవదీప్‌పై దాడి చేశారని యువకుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో మనస్తాపానికి గురైన నవదీప్ మిద్దెపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపారు. వెంటనే గమనించిన తల్లిదండ్రులు నవదీప్‌ను మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం నవదీప్ తండ్రి రవి మీడియాతో మాట్లాడుతూ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ ఘటనపై సంబంధిత పోలీసు అధికారులు స్పందించి, ఆరోపణలపై విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాల్సి ఉంది.