Bharat Aawaz

ఓబీసీ కులగణన చేపట్టాలని భారీ బహిరంగ సభ

Avunoori Mahesh
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
2 min read
0
Comments
133
Views

శంషాబాద్: జాతీయ జనగణనలో ఓబీసీ కులాల గణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ టీపీసీసీ ఓబీసీ సెల్ ఆధ్వర్యంలో శంషాబాద్‌లోని గొల్లపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించారు. టీపీసీసీ ఓబీసీ సెల్ చైర్మన్, ఎమ్మెల్యే శంకరయ్య అధ్యక్షతన జరిగిన ఈ సభకు పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఓబీసీ సెల్ చైర్మన్ అనిల్ జైహింద్, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, సీడబ్ల్యూసీ సభ్యుడు వంశీ చంద్ రెడ్డి, ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్‌తో పాటు ప్రజాప్రతినిధులు, బీసీ నాయకులు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సభలో జాతీయ జనగణనలో ఓబీసీ కులగణనకు సంబంధించిన డిమాండ్‌పై నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.