ఆంధ్రప్రదేశ్ బీసీలకు 50 శాతం ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలి ఓబిసి జాతీయ అధ్యక్షుడు పోతల ప్రసాద్ నాయుడు

0
233

ఆంధ్రప్రదేశ్ లో బీసీలకు రాజ్యాధికారం దక్కాలంటే బీసీ నాయకులు పాలసీ మేకర్లుగా ఎదగాలని, అందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని ఓబీసీ జ్యోతిరావు ఫూలే జాతీయ అధ్యక్షుడు పోతల ప్రసాద్ నాయుడు అన్నారు.

రాష్ట్రంలో బీసీ జనాభా 50 శాతానికి పైగా ఉన్నప్పటికీ అసెంబ్లీలో వారికి తగిన ప్రాతినిధ్యం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన రాజకీయ పార్టీలకు నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే అసెంబ్లీ స్థానాల్లో 50 శాతం బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు.చట్టపరంగా రిజర్వేషన్లు చెల్లవని తెలిసి కూడా బీసీలకు రిజర్వేషన్ల పేరుతో ప్రధాన రాజకీయ పార్టీలు డ్రామాలాడుతున్నాయని విమర్శించారు. ఎన్నికల సమయంలో అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీల ఓట్ల కోసం రాజకీయ నాటకాలు ఆడటం సరికాదన్నారు.బీసీల మీద నిజంగా ప్రేమ ఉంటే వారిని పాలసీ మేకర్లుగా, రాజ్యాధికారంలో భాగస్వాములుగా చేయాలనుకుంటే ఎమ్మెల్యే సీట్లలో 50 శాతం కేటాయించాలని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన రాజకీయ పక్షాలు రెండు కుటుంబాలకు చెందిన వారేనని, వారికి ఇష్టం వచ్చినట్టుగా సీట్లు ఇచ్చుకునే అవకాశం ఉందని, బీసీల మీద నిజమైన ప్రేమ ఉంటే బీసీలకు ఎమ్మెల్యే సీట్ల కేటాయింపులో 50 శాతం కేటాయించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని పోతల ప్రసాద్ నాయుడు డిమాండ్ చేశారు. జ్యోతిరావు ఫూలే ఆశయం కేవలం విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లకే పరిమితం కాదని, అధికారంలో వాటా దక్కినప్పుడే బీసీల బతుకులు మారుతాయని ఆయన అన్నారు.

Search
Categories
Read More
Telangana
చేవెళ్ల డిక్లరేషన్ 12 హామీలను వెంటనే అమలు చేయాలి. ఎస్సీ రిజర్వేషన్లు 18% పెంచాలి ఆసిఫాబాద్ దీక్ష భూమిలో ఎస్సీ సంక్షేమ సంఘం డిమాండ్.. త్వరలోనే ఎస్సీ 59 కులాల ఆత్మగౌరవ జిల్లా మహాసభ
కుమురం భీం ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్):  కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ దీక్ష...
By Chunarkar Jagadeesh 2026-10-04 17:32:12 0 175
BMA
Saket Police Assault: Two Journalists Beaten in Delhi
A major political and media storm has erupted following allegations that two female journalists...
By JoinBMA 2026-09-09 05:44:51 0 271
Andhra Pradesh
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు పురస్కరించుకొని ముందుగానే శుభాకాంక్షలు తెలియజేసిన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు
నేడు తాడేపల్లిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి...
By Rajini Kumari 2025-12-19 12:18:23 0 289
Andhra Pradesh
ఆంజనేయ స్వామి తిరునాళ్లలో కూటమి నాయకులు కొత్తూరు మురళి
గురువారం చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం, మోదుగుల పల్లె పంచాయతీ, బడిగిరెడ్డి పల్లె గ్రామస్తుల...
By Kothuru Murali 2026-04-03 09:54:31 0 202
Andhra Pradesh
తాడిపత్రి లో బైక్ ర్యాలీ
తాడిపత్రి పట్టణం లో హనుమాన్ జయంతి సందర్భంగా హిందూసోదరులు బైక్ ర్యాలీ నిర్వహించారు . ఇందులో ఆర్...
By Gitta Raju 2026-04-03 01:06:31 0 556
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com