Madanapalle: మదనపల్లెలో తప్పుడు రికార్డులతో భూమి ఆక్రమించారని బాధితుల ఆరోపణ. తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించి న్యాయం చేయాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి.

0
56

Madanapalle: కమ్మపల్లికి చెందిన తమ భూమిని సొంత అన్న ఆర్. తులసి నాయుడు తప్పుడు రికార్డులు సృష్టించి ఆక్రమించుకున్నారని ఆర్. దేవేంద్ర కుమార్, ఆర్. చంద్రశేఖర్, లేట్ రుసేంద్రనాయుడు కుమారుడు శశికుమార్ ఆరోపించారు. తమను ఇబ్బందులకు గురిచేస్తూ, భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, తమకు ప్రాణహాని ఉందని వారు మదనపల్లె ప్రెస్ క్లబ్‌లో విలేకరుల ముందు ఆవేదన వ్యక్తం చేశారు. వారు తెలిపిన వివరాల మేరకు కమ్మపల్లిలోని సర్వే నంబర్ 163/1లో 1.08 ఎకరాల భూమిపై 2002లో న్యాయస్థానం తమకు హక్కులు కల్పించిందన్నారు. అయినప్పటికీ తప్పుడు రికార్డులు సృష్టించి, రాజకీయ అండదండలతో తమ భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై పోలీసులు, ఉన్నతాధికారులు స్పందించి తమకు రక్షణ కల్పించడంతో పాటు న్యాయం చేయాలని వారు విలేకరుల ద్వారా కోరారు.

 

 

Search
Categories
Read More
Andhra Pradesh
జర్నలిస్టు అవార్డుల పేర్లు మార్చిన ఏపీ ప్రభుత్వం.. కొత్త పేర్లు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో జర్నలిస్టులకు అందించే పలు పురస్కారాల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం మారుస్తూ కీలక...
By Pagadala Venkateswar 2026-08-28 05:52:04 0 92
Andhra Pradesh
YS Viveka: వైఎస్ వివేకా హత్య కేసు.. సుప్రీంకోర్టులో కీలక పరిణామం.
ఈ కేసులో తదుపరి దర్యాప్తు అవసరమా అని సీబీఐని ప్రశ్నించిన ధర్మాసనం ఎవరిని విచారించాలనుకుంటున్నారో...
By Pagadala Venkateswar 2026-01-21 06:26:52 0 222
Andhra Pradesh
మదనపల్లె గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం.
మదనపల్లెలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో 3 నుంచి 9వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులను...
By Pagadala Venkateswar 2026-04-25 04:32:33 0 133
Andhra Pradesh
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన_ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాము. ఈ సందర్భంగా ప్రజలందరికీ...
By John Baji 2026-01-01 02:48:16 0 221
Telangana
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్‌లో కలకలం జిల్లా ప్రధాన కార్యదర్శి గాదవేణి మల్లేష్ రాజీనామా
🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్...
By Chunarkar Jagadeesh 2026-08-11 08:00:31 0 174
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com