రైతు కన్నీటిని తుడవండి.కరువు సాయం అందించండి
Posted 2026-09-11 15:40:06
0
203
సత్యసాయి జిల్లా : వర్షాభావంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నందున సత్యసాయి జిల్లాను వెంటనే కరువు జిల్లాగా ప్రకటించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్, రైతు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కమతం కాటమయ్య డిమాండ్ చేశారు.శుక్రవారం పుట్టపర్తి కలెక్టరేట్ ఎదుట రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో 98 లక్షల ఎకరాలకు గాను 34 లక్షల ఎకరాల్లో సాగు జరగలేదని, సాగైన పంటలు కూడా వర్షాభావంతో ఎండిపోతున్నాయని నాయకులు తెలిపారు.కరువు మండలాలను గుర్తించి తక్షణ సాయం అందించాలని, పంట రుణాలు మాఫీ చేసి ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు, సీపీఐ నేతలు, రైతులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Churu Court Delivers Verdict in Shocking 2022 Murder Case Involving Woman, Occultist
Churu (Rajasthan): In a chilling case that shook Rajasthan’s Churu district, the District...
Tojo Karga IPS: Leading Progressive Prison Reforms
A distinguished 2007-batch IPS officer of the AGMUT Cadre, Tojo Karga is serving as Inspector...
.సోమల: ఎమ్మెల్యే భరోసాతో ధర్నా విరమణ
పుంగనూరు నియోజకవర్గంలోని సోమల మండలం, రాంపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుడు...
డాక్టర్ ఎన్టీఆర్ వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకంలో భాగంగా ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్
బాపట్ల జిల్లా: కొత్తపాలెం గ్రామము మరియు చెరుకూరు గ్రామాలలో ఈరోజు నుంచి 17వ తేదీ వరకు వారం...
సత్తా చాటిన చౌడేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు
పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 70% విద్యార్థులు ఉత్తీర్ణత...