రాష్ట్ర ఉత్తమ ప్రధానోపాధ్యాయుడికి ఘన సన్మానం

0
94

చీరాల N.R.& P.M. హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ సభ్యుడు, N.R.& P.M. హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు **బి. సాల్మన్ రాజు**కు ఘన సన్మానం నిర్వహించారు. ఇటీవల ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఏ కన్వెన్షన్‌లో గౌరవ ముఖ్యమంత్రి **నారా చంద్రబాబు నాయుడు**, విద్యాశాఖ మంత్రి **నారా లోకేష్** చేతుల మీదుగా రాష్ట్ర ఉత్తమ ప్రధానోపాధ్యాయుల అవార్డును అందుకున్న సందర్భంగా ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు **పోలుదాసు రామకృష్ణ** మాట్లాడుతూ.. పేరాల ఆంధ్రరత్న మున్సిపల్ హైస్కూల్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసిన బి. సాల్మన్ రాజు 1990లో అదే పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరారని తెలిపారు. 1998లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారని, N.C.C. అధికారిగా 15 సంవత్సరాల పాటు సేవలందించి ఉత్తమ అధికారిగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు.

అనంతరం ప్రధానోపాధ్యాయుడిగా పదోన్నతి పొంది సుమారు 35 సంవత్సరాల పాటు అదే పాఠశాలలో సేవలందించిన ఆయన ఇటీవల బదిలీపై N.R.& P.M. హైస్కూల్‌కు వచ్చారని తెలిపారు. విద్యార్థులకు గణితాన్ని సులభంగా, అర్థమయ్యే రీతిలో బోధిస్తూ విద్యారంగంలో విశిష్ట సేవలు అందించినందుకు రాష్ట్ర ఉత్తమ ప్రధానోపాధ్యాయుల అవార్డు రావడం తమ అసోసియేషన్ సభ్యులందరికీ ఎంతో ఆనందంగా ఉందన్నారు.

అవార్డు అందుకున్న సాల్మన్ రాజును వాకర్స్ అసోసియేషన్ సభ్యులు శాలువా కప్పి ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. అనంతరం అసోసియేషన్ సభ్యులకు అల్పాహారం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో చారగుళ్ల గురుప్రసాద్, సుధాకరరావు, బాల సుబ్బారావు, కొమ్మూరి వీరాంజనేయులు, నారాయణమూర్తి, డి.వి. సురేష్, సర్విసెట్టి సుబ్బరామయ్య, నారాయణ, ఎం.ఎస్. సత్యనారాయణ, బ్రహ్మానందం, శ్రీను, వీరాంజనేయులు, శివాంజనేయ ప్రసాద్ తదితర వాకింగ్ సభ్యులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Kerala
Monsoon Knocking: Heavy Rain & Alerts Hit 10 Districts
The Southwest Monsoon is at Kerala's doorstep, prompting the India Meteorological Department...
By Dunna Jessicaruth 2026-05-25 06:21:09 0 224
Telangana
తప్పిపోయిన చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన పోలీస్ కమిషనర్
  నిజామాబాద్ ప్రభుత్వ ఆసపత్రి నుంచి 2½ సంవత్సరాల చిన్నారి కోసడి వేదాన్ష్ అపహరణ ఘటనపై...
By Chakrala Sadhanand 2026-09-06 06:16:18 0 99
Telangana
కాలనీ సమస్యలను తొలగించే దిశగా కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పర్యటన.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్134 (ఓల్డ్) డివిజన్ బిఆర్ఎస్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్...
By Sidhu Maroju 2025-12-19 08:29:30 0 268
Andhra Pradesh
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
విజయనగరం జిల్లా ఎల్.కోట మండలంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. వేపాడ...
By Boiena Rajesh 2026-02-26 15:58:28 0 357
Telangana
హైదరాబాద్ మెట్రో – దేశంలో రెండో అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్, దేశంలో రెండవ అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌గా...
By Bharat Aawaz 2025-08-12 07:25:07 0 818
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com