ఉపాధ్యాయులు దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే మహనీయులు 12 మంది ఉపాధ్యాయులకు ఘన సన్మానం**

0
154

చీరాల:

భారతరత్న, తత్వవేత్త, విద్యావేత్త, రాజనీతిజ్ఞుడు, భారత మాజీ ఉపరాష్ట్రపతి మరియు రెండో రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని చీరాల N.R.& P.M. హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

 

స్థానిక గ్రౌండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం 12 మంది ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.

 

ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు **పోలుదాసు రామకృష్ణ** మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు అజ్ఞానాన్ని పారద్రోలి విద్యార్థుల్లో జ్ఞానాన్ని నింపే శక్తి అని అన్నారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే మహనీయులు ఉపాధ్యాయులని పేర్కొన్నారు. విద్యార్థులకు అక్షరాలు దిద్దించిన నాటి నుంచి వారి ఆశయాలకు రెక్కలు తొడిగి సమాజంలో ఉన్నతంగా నిలబెట్టే వరకు గురువులు పడే శ్రమ వెలకట్టలేనిదని అన్నారు.

 

ఈ సందర్భంగా డా. పి. శివాంజనేయ ప్రసాద్, మువ్వల సాంబశివరావు, పులిమి శ్రీకృష్ణప్రసాద్, కొమ్మూరి వీరాంజనేయులు, చుక్కా శ్రీనివాసరావు, తిరుమలశెట్టి లక్ష్మీ ప్రతాప్, బాల వెంకటేశ్వరరావు, నక్కల వెంకట సుబ్బారావు, బుర్ల వెంకటేశ్వర్లు, టి. నాగేశ్వరరావు, ఆ. కృష్ణారెడ్డి, బొల్లెపల్లి వెంకట్రావు లను ఘనంగా సన్మానించారు.

 

కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పోలుదాసు రామకృష్ణతో పాటు చారగుళ్ల గురుప్రసాద్, సుధాకరరావు, వలివేటి మురళీకృష్ణ, నారాయణమూర్తి, వీరాంజనేయులు తదితర వాకింగ్ సభ్యులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ దుండి రాకేశ్ పై జరిగిన దాడి అత్యంత అమానుషమని చీరాల తెలుగు యువత అధ్యక్షుడు దోగుపర్తి బాలకృష్ణ మండిపడ్డారు.
 గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ ఘటనను తీవ్రంగా...
By Vadlamudi NagaVenkat 2026-04-30 11:11:30 0 289
Telangana
ఇక నుంచి చెరువుమాదారం లో PHC సేవలు అందుబాటు
జిల్లా కలెక్టర్ ఆదేశాలతో చెరువుమాదారం గ్రామానికి PHC తరలింపు చేశారు.కాగా ఇక నుంచి డాక్టర్లు రోజు...
By Krishna Balina 2026-01-08 09:39:31 0 252
Andhra Pradesh
సహకార సంస్థల అభివృద్ధి, రైతుల సంక్షేమమే లక్ష్యం – ఎమ్మెల్యే గళ్ళా మాధవి
గుంటూరు మిర్చి యార్డు చైర్మన్‌గా నూతనంగా నియమితులైన శ్రీ కుర్రా అప్పారావు సోమవారం గుంటూరు...
By John Baji 2025-12-30 01:20:59 0 248
Andhra Pradesh
కశింకోట అంతర్-మండల మోటార్ల దొంగల ముఠా అరెస్ట్: 8 మోటార్లు, బైక్ స్వాధీనం
 *కశింకోటలో వరుస చోరీలకు చెక్ పెట్టిన ప్రత్యేక బృందం* కశింకోట: మండల పరిధిలోని పలు...
By Bhesetti Lovaraju 2026-02-04 13:17:11 0 590
Andhra Pradesh
ఆక్సిజన్ ప్లాంట్ల వద్ద కార్ల పార్కింగ్ - పొంచి ఉన్న ప్రమాదం.
మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఆసుపత్రిలోని భారీ...
By Pagadala Venkateswar 2026-03-05 06:45:17 0 192
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com