ఘనంగా దివంగత నేత స్వర్గీయ డా: వై, ఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి!

0
157

చింతూరు మండలంలో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమాన్ని చింతూరు మండల కమిటీ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిమ్మలగూడెం నుంచి చింతూరు, చట్టి మీదుగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఘన నివాళులు అర్పించారు. అనంతరం చింతూరు సెంటర్లోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ప్రజా సేవలను, పేదలు మరియు సామాన్య ప్రజల సంక్షేమం కోసం చేసిన కృషిని నాయకులు ఈ సందర్భంగా స్మరించుకున్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలని పలువురు నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం సందర్భంగా చింతూరు మండలంలో అభిమానులు, కార్యకర్తల సందడి నెలకొంది. చింతూరు మండల కమిటీ సభ్యులు మరియు కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.

 

# Yadagiri 

Search
Categories
Read More
Andhra Pradesh
ఉమ్మడి విజయనగరం జిల్లా మహిళా ఎమ్మెల్యేల శారీ వాక్
విజయవాడలో ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు శుక్రవారం సందడి చేశారు. అసెంబ్లీ...
By Boiena Rajesh 2026-03-07 02:40:50 0 281
Andhra Pradesh
*రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం
*రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు*  *యర్రగొండపాలెం నియోజకవర్గ...
By Chennaiah Kati 2026-02-28 03:40:33 0 377
Bharat Aawaz
Telangana Announces 2025 SSC Supplementary Results
Hyderabad, June 27, 2025: The Telangana Board of Secondary Education (BSE Telangana) has declared...
By Bharat Aawaz 2025-06-27 11:11:22 0 2K
Kerala
Kozhikode Nipah Alert: Successful Containment Measures Enacted
In mid-June 2026, health authorities in Kerala’s Kozhikode district acted swiftly following...
By Lokeshwari Panthadi 2026-06-29 05:28:14 0 122
Telangana
ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని MRO ధ్రువ కుమార్,...
By Nookapangu Manikanta 2026-04-22 12:52:17 0 191
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com