డ్రగ్స్ ముఠా గుట్టురట్టు.. ఐదుగురు అరెస్ట్.|

0
97

● రూ.19 లక్షల విలువైన 1.9 కిలోల డ్రగ్ స్వాధీనం

● ఐదుగురు సభ్యుల అంతర్‌జిల్లా ముఠా అరెస్ట్

● ముఠా సూత్రధారి మాజీ ఎక్సైజ్ కానిస్టేబుల్.. ఇప్పటికే మూడు NDPS కేసులు

అల్వాల్, సెప్టెంబరు 2: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పేట్ బషీరాబాద్ పోలీసులు కొంపల్లి పరిసరాల్లో అల్ఫ్రాజోలం డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేశారు. 

నిఘా వర్గాల నుంచి అందిన పక్కా సమాచారంతో నిర్వహించిన దాడుల్లో ఐదుగురు సభ్యుల అంతర్‌జిల్లా ముఠాను అరెస్ట్ చేసి, వారి నుంచి సుమారు రూ.19 లక్షల విలువైన 1.9 కిలోల అల్ఫ్రాజోలం స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లాకు చెందిన మాజీ ఎక్సైజ్ కానిస్టేబుల్ గొల్ల రమేశ్ ఈ ముఠాకు ప్రధాన సూత్రధారిగా వ్యవహరిస్తున్నాడు. అతనిపై గతంలోనే మూడు NDPS కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. 

కామారెడ్డి ప్రాంతం నుంచి అల్ఫ్రాజోలంను అక్రమంగా తీసుకువచ్చి కొంపల్లి, కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.

నిందితుల నుంచి అల్ఫ్రాజోలం డ్రగ్‌తో పాటు రవాణాకు ఉపయోగించిన కారు, బైక్, సెల్‌ఫోన్లు, రూ.40 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

ముఠా వెనుక ఉన్న డ్రగ్స్ సరఫరా వ్యవస్థ, ఇతర వ్యక్తుల ప్రమేయంపై పేట్ బషీరాబాద్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

#sidhumaroju

Alwal 

Search
Categories
Read More
Andhra Pradesh
బాపట్ల జిల్లాలో ఘనంగా జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు* *ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శక్తి స్టాల్*
ఈ సందర్భంగా బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో 5 శక్తి బృందాలు నిరంతరం...
By Vadlamudi NagaVenkat 2026-03-08 15:37:45 0 970
Andhra Pradesh
పెనుగంచిప్రోలు లక్ష్మీ తిరుపతమ్మ మాలధారణ ప్రారంభం
*పెనుగంచిప్రోలు: తిరుపతమ్మ మాలాధారణ ప్రారంభం*    పెనుగంచిప్రోలులోని శ్రీ గోపయ్య సమేత...
By Rajini Kumari 2025-12-15 07:54:23 0 266
Telangana
హర్యానా కమ్యూనిటీ సభ్యులతో ఈటల రాజేందర్ ఆత్మీయ సమ్మేళనం. ¡
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా : మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ అల్వాల్ పరిధిలోని మచ్చ...
By Sidhu Maroju 2026-02-03 04:56:09 0 214
BMA
MIB 2026 Rules: Examining Media Cross-Ownership Limits
The newly drafted Telecommunications (Television, Radio and Associated Services) Rules 2026...
By JoinBMA 2026-09-11 06:45:08 0 108
Andhra Pradesh
ఇంద్రకీలాద్రిపై వైభవంగా వసంత నవరాత్రులు
ప్రకటన ఇంద్రకీలాద్రిపై వైభవంగా వసంత నవరాత్రులు: కనకాంబరాలు, గులాబీలతో జగన్మాతకు ప్రత్యేక...
By Rajini Kumari 2026-03-20 16:19:51 0 244
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com