ఇక ఉత్తరాంధ్రకు సాగునీటి కష్టాలు దూరం.. రైతుల కలను నిజం చేస్తున్నాం: మంత్రి లోకేశ్.

0
62

ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తమ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలను విడుదల చేస్తున్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల అభివృద్ధి ఆకాంక్షలకు తమ ప్రభుత్వం రెక్కలు తొడుగుతోందని, ఇందులో భాగంగానే పరిశ్రమల ఏర్పాటుతో పాటు ఇప్పుడు గోదావరి జలాలను అందిస్తున్నామని తెలిపారు.

 

పోలవరం ఎడమ కాలువ ద్వారా నీటి విడుదల ఉత్తరాంధ్ర రైతుల అభివృద్ధికి ఆరంభమని లోకేశ్ అభివర్ణించారు. సముద్రంలోకి వృథాగా పోతున్న గోదావరి జలాలను మళ్లించి ఈ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు అందిస్తున్నామని వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్తరాంధ్రతో పాటు తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల రైతులకు కూడా ఎంతో మేలు చేకూరుతుందని చెప్పారు. మొత్తం 2.87 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరగనుందని పేర్కొన్నారు. పోలవరం కుడి కాలువ ద్వారా ఇప్పటికే రైతులు సుమారు 500 టీఎంసీల నీటిని వినియోగించుకున్నారని, అదే తరహాలో ఎడమ కాలువ ద్వారా కూడా ఉత్తరాంధ్ర రైతుల సాగునీటి కష్టాలు తీరతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Search
Categories
Read More
BMA
River Guardians: Micro-Sensors Expose Illegal Effluents
Sacred rivers and local streams frequently suffer from clandestine industrial effluent dumping...
By JoinBMA 2026-08-22 07:58:22 0 158
Andhra Pradesh
మదనపల్లె వద్ద రోడ్డు ప్రమాదం.. యువకుడికి తీవ్ర గాయాలు.
శనివారం మదనపల్లె పట్టణంలోని వైఎస్సార్ కాలనీ సమీపంలో రాయల్ వుడ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో...
By Pagadala Venkateswar 2026-06-21 07:31:42 0 83
Telangana
జూనియర్ సివిల్ జడ్జి గ ఎంపికైన ఏకారి లిఖిత కి అభినందనలు తెలిపిన రఘునాథ్ వెర్రబెల్లి
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ శ్రీరాంపూర్ అరుణక్కనగర్ కి చెందిన ఏకారి లిఖిత  ఆంధ్ర ప్రదేశ్...
By Avunoori Mahesh 2026-04-12 07:09:57 0 214
SURAKSHA
P. Amudha, IAS: Driving Transparent and People-Centric Governance
An accomplished IAS officer whose commitment to transparent governance, administrative reforms,...
By Lokeshwari Panthadi 2026-07-20 07:57:28 0 186
BMA
"Break Their Legs" Order Raises Serious Concerns Over Police Brutality in Bhubaneswar
On June 29, 2025, Additional Commissioner of Bhubaneswar was caught on camera instructing...
By Citizen Rights Council 2025-06-30 08:54:59 0 3K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com