యువతకు ఉచిత శిక్షణ, ఉద్యోగలే లక్ష్యంగా ముందడుగు

0
153

మంచిర్యాల : పోలీస్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ (SI), ఫారెస్ట్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తూ మంచిర్యాల కాలేజీ రోడ్డులోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో కీ.శే. శ్రీ కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ , మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు , మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ,ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రతిభ ఉన్న ఏ ఒక్క యువకుడు, యువతి ఉద్యోగ అవకాశాన్ని కోల్పోకూడదనే ఉద్దేశంతో ఉచిత శిక్షణ అందిస్తున్నామని తెలిపారు,పోటీ పరీక్షలకు అవసరమైన మెరుగైన శిక్షణ, సరైన మార్గదర్శకత్వం, క్రమశిక్షణతో కూడిన అభ్యాసం ద్వారా యువత తమ లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కలతో ముందుకు సాగుతున్న యువతకు ఈ శిక్షణ కార్యక్రమం ఒక మంచి అవకాశంగా నిలవాలని, ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని ఉద్యోగం సాధించే వరకు పట్టుదలతో కృషి చేయాలని ఎమ్మెల్యే చెప్పారు,ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య , హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ చైర్మన్, సభ్యులు, సింగరేణి సంస్థ అధికారులు, DCP భాస్కర్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్ , మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య- మహేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కార్పొరేటర్ తూముల నరేష్, కార్పొరేటర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, నాయకులు,మహిళా నాయకురాలు,యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
కొత్తచెరువు బేబీ పాండ్‌లో గణేష్ నిమజ్జనాలు.|
● భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిమజ్జన కార్యక్రమం ● భక్తుల ఆనందోత్సాహాల మధ్య గణనాథులకు ఘన...
By Sidhu Maroju 2026-09-20 16:33:02 0 39
Telangana
ఘనంగా బీర్ల శంకర్ జన్మదిన వేడుకలు
భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట మే 14  ఈరోజు కాంగ్రెస్ సీనియర్ రాష్ట్ర నాయకులు సర్పంచ్ల ఫోరం...
By Pindikura Mahesh 2026-05-14 18:08:04 0 221
Andhra Pradesh
విద్యుత్ చార్జీలపై దోచింది కొండంత.. తిరిగిచ్చేది పిసరంత
వైఎస్ షర్మిలా రెడ్డి గారు ఏపీసీసీ చీఫ్ విద్యుత్ చార్జీలపై దోచింది కొండంత.. తిరిగిచ్చేది పిసరంత....
By Chennaiah Kati 2026-07-16 11:53:20 0 100
SURAKSHA
AP పోలీసులు నేడు: బ్యాడ్జి లేని హృదయం ఉన్న హీరోలు
నేడు AP పోలీసులు బ్యాడ్జి లేకపోయినా హీరోలని నిరూపించారు. అనాథ పిల్లలకు సంరక్షకులుగా మారి చదువు,...
By Kalaga Sailaja 2026-07-04 09:37:28 0 148
Telangana
Hyderabad Startup Ecosystem Emerges as India Innovation Hub
Hyderabad has rapidly evolved into one of India’s leading startup ecosystems, driven by...
By Fathima Safa 2026-06-29 11:58:37 0 206
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com