కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థి మండలి పదవీ స్వీకారోత్సవంలో పాల్గొన్న మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

0
116
మంచిర్యాల నియోజకవర్గం :మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18వ డివిజన్ (గుడిపేట) లోని కేంద్రీయ విద్యాలయంలో ఏర్పాటు చేసిన విద్యార్థి మండలి పదవీ స్వీకారోత్సవ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్  కుమార్ దీపక్ , మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు,ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన విద్యార్థి మండలి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి, వారికి బాధ్యతలను అప్పగించారు. విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన ఆలోచనా విధానం, సమాజం పట్ల సేవాభావం పెంపొందించుకోవాలని కలెక్టర్, ఎమ్మెల్యే  సూచించారు,విద్యార్థి మండలి ద్వారా పాఠశాలలో విద్యార్థుల సమస్యలను తెలుసుకోవడం, పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం, తోటి విద్యార్థులకు మార్గదర్శకంగా నిలవడం వంటి కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు..
విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని, నూతన విద్యార్థి మండలి సభ్యులకు అభినందనలు తెలిపారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నాయకత్వ ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు,ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు , కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Search
Categories
Read More
Telangana
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పై స్టే : హైకోర్టు
 హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్లపై స్టే విధించిన హైకోర్టు తెలంగాణ...
By Sidhu Maroju 2025-10-09 10:38:17 0 305
SURAKSHA
TN Police Today: Serving Beyond Duty With Humanity
Today Tamil Nadu police officers proved service goes beyond duty hours. In Chennai, Coimbatore,...
By Kalaga Sailaja 2026-07-04 07:34:33 0 108
Telangana
పెద్దపల్లి జిల్లా : గోదావరిఖని బిల్డింగ్ పై నుంచి దూకి యువతి మృతి.!
గోదావరిఖని రమేష్ నగర్ 2 వ అంతస్తు బిల్డింగ్ పైనుంచి పడి యువతి సాధన 34 సంవత్సరాలు చనిపోయింది....
By Sunka Santhosh 2026-05-23 18:55:28 0 159
Dadra &Nager Haveli, Daman &Diu
Industrial Showcase: Grand Finale of the Daman Book Fair
The mega Book Fair & Industrial Exhibition 2026 enters its final days at the Light House...
By Dunna Jessicaruth 2026-05-14 12:48:45 0 189
Telangana
"విద్యుత్ ఘాతంతో మరణించిన బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి."|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఆల్వాల్ పరిధిలో ఇటీవల టెలికాం కాలనీలో చోటుచేసుకున్న ఘోర విద్యుత్...
By Sidhu Maroju 2026-06-16 10:51:48 0 137
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com