బీసీల సమగ్ర కుల గణన చేపట్టాలి బీసీ సంక్షేమ సంఘం డిమాండ్
Posted 2026-08-24 23:51:52
0
276
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ): దేశవ్యాప్తంగా చేపట్టే జనగణనలో బీసీల సమగ్ర కుల గణనను శాస్త్రీయంగా, పారదర్శకంగా నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు రూపూనార్ రమేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా అదనపు కలెక్టర్‌కు సంఘం ప్రతినిధులతో కలిసి ఆయన ఒక వినతిపత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా రూపూనార్ రమేష్ మాట్లాడుతూ.. బీసీలకు జనాభా ప్రాతిపదికన న్యాయమైన రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో వెనుకబడిన వర్గాలకు తగిన ప్రాతినిధ్యం దక్కాలని ఆకాంక్షించారు. రాబోయే జనగణనలో కులాల వారీగా వాస్తవ జనాభాను అధికారికంగా నమోదు చేయాలని, అప్పుడే బీసీలకు సంపూర్ణ న్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం ముఖ్య నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Krishna Prakash: Inspiring Courage Through Police Leadership
Widely known as the "Ironman IPS Officer," Krishna Prakash has transformed policing through...
2029 నాటికి ప్రతి ఇంటిపై సోలార్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యం
2029 నాటికి ప్రతి ఇంటిపై సోలార్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుందని...
జులై 29న గురు పౌర్ణమి వేడుకలు.. ముమ్మరంగా ఏర్పాట్లు!
అన్నమయ్య జిల్లా పెద్దమండ్యం మండలం గుడిశవారిపల్లి సాయిబాబా ఆలయంలో జులై 29న గురు పౌర్ణమి వేడుకలను...
ఐక్యతతో అభివృద్ధి సాధించుకుందాం గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
*విడిపోయి చెడిపోయే కంటే... ఐక్యతతో అభివృద్ధి సాధించుకుందాం: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*...
Odisha Industrial and Economic Growth: Latest Developments
Odisha has emerged as one of India’s leading industrial hubs, driven by strong growth in...