ఆసిఫాబాద్ లో 24 గంటల్లోనే దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు. నిందితుడు అరెస్ట్

0
246

 🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని  ఆసిఫాబాద్ మండల పోలీసులు మెరుపు దర్యాప్తుతో ఒక చోరీ కేసును కేవలం 24 గంటల్లోనే ఛేదించి తమ చాకచక్యాన్ని నిరూపించుకున్నారు. తాళం వేసి ఉన్న ఒక ఇంట్లో భారీ దొంగతనానికి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసి, చోరీకి గురైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆసిఫాబాద్ మండలం కొత్త రాహపల్లి గ్రామానికి చెందిన లలిత అనే మహిళ వ్యవసాయ పనుల నిమిత్తం తన ఇంటికి తాళం వేసి పొలానికి వెళ్లారు. అదే గ్రామానికి చెందిన వడై లాలాజీ అనే వ్యక్తి ఇల్లే లక్ష్యంగా చేసుకుని లోపలికి చొరబడ్డాడు. ఇంట్లోని అల్మారా తాళం పగులగొట్టి, అందులో ఉన్న సుమారు రూ.1.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలను అపహరించుకుపోయాడు.బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఆసిఫాబాద్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. సీఐ రవి గారి ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం నిందితుడు వడై లాలాజీని గుర్తించి అదుపులోకి తీసుకుంది. అతడిని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. నిందితుడి వద్ద నుండి చోరీకి గురైన 38.320 గ్రాముల బంగారు నగలను పోలీసులు విజయవంతంగా రికవరీ చేశారు.నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ రవి గారు అధికారికంగా ప్రకటించారు. ఫిర్యాదు అందిన రోజే స్పందించి, తక్కువ సమయంలోనే నిందితుడిని పట్టుకుని బంగారు ఆభరణాలను రికవరీ చేసిన పోలీసుల పనితీరుపై స్థానిక ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Search
Categories
Read More
BMA
River Guardians: Micro-Sensors Expose Illegal Effluents
Sacred rivers and local streams frequently suffer from clandestine industrial effluent dumping...
By JoinBMA 2026-08-22 07:58:22 0 159
SURAKSHA
Rajeev Verma, IAS: Leading Chandigarh with Vision & Integrity
The Journey Begins A Leader Committed to Public Service "Good governance is not merely about...
By Fathima Safa 2026-07-23 04:29:56 0 107
BMA
Gamifying the Gig Economy: Empathy Through Play
To highlight the struggles of the gig economy, investigative newsrooms are launching immersive...
By JoinBMA 2026-08-21 18:49:59 0 393
Andhra Pradesh
మదనపల్లె: బాధితుల వద్దకే వెళ్లి అర్జీలు స్వీకరించిన ఎస్పీ.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్, పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు...
By Pagadala Venkateswar 2026-04-07 03:53:37 0 166
Telangana
'టీం ఇండియా' అని పిలవొద్దా: సుప్రీం కోర్టు ఇచ్చిన షాకింగ్ రిప్లై ఇదే.|
హైదరాబాద్ (భారత్ ఆవాజ్ ప్రతినిధి)   'టీం ఇండియా' ఈ పేరుపై దాఖలైన ఓ పిటిషన్ పట్ల సుప్రీం...
By Sidhu Maroju 2026-01-22 08:32:41 0 233
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com