కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను వెంటనే పునరుద్ధరించాలి

0
105

హైకోర్టు తీర్పును సాకుగా చూపి పేదింటి ఆడబిడ్డలకు అన్యాయం చేయొద్దు

 

కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం

 

నిజామాబాద్:

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారి పిలుపు మేరకు, నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారి ఆదేశాల మేరకు, బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు సిర్ప రాజు ఆధ్వర్యంలో ఈరోజు నిజామాబాద్ ధర్నా చౌక్‌లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా *“CM Down Down”* అంటూ నినాదాలు చేశారు.

 

ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, ఆర్థిక భరోసాకు ప్రతీకగా నిలిచిన *కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని* ఆరోపించారు. హైకోర్టు తీర్పును సాకుగా చూపుతూ లక్షలాది పేద కుటుంబాలకు అండగా నిలిచిన సంక్షేమ పథకాలను రద్దు చేసే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండించారు.

 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం పేద కుటుంబాల్లో ఆడబిడ్డ వివాహం ఎంతటి ఆర్థిక భారంగా మారుతుందో గుర్తించిన అప్పటి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు 2014 అక్టోబర్ 2న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రారంభించారని గుర్తుచేశారు. ప్రారంభంలో రూ.51 వేలుగా ఉన్న ఆర్థిక సహాయాన్ని దశలవారీగా రూ.75,116కు, అనంతరం రూ.1,00,116కు పెంచి పేద కుటుంబాలకు అండగా నిలిచారని తెలిపారు.

 

కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సుమారు *13 లక్షల మంది ఆడబిడ్డల కుటుంబాలకు రూ.13 వేల కోట్ల మేర ఆర్థిక సహాయం* అందించారని, కరోనా వంటి తీవ్రమైన ఆర్థిక సంక్షోభ సమయంలో కూడా కళ్యాణ లక్ష్మి పథకాన్ని కొనసాగిస్తూ పేద కుటుంబాలకు భరోసా కల్పించారని పేర్కొన్నారు.

 

అయితే ఎన్నికల సమయంలో కళ్యాణ లక్ష్మితో పాటు ఆడబిడ్డలకు *తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ,* అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాన్ని మరింత బలోపేతం చేయాల్సింది పోయి, దానినే రద్దు చేసే కుట్రకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. ఎన్నికల హామీ ప్రకారం తులం బంగారం కోసం ఆడబిడ్డలు, వారి కుటుంబాలు ప్రశ్నిస్తుండటంతో ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా పథకాన్నే ఎత్తివేయాలని చూస్తున్నారని ఆరోపించారు.

 

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కళ్యాణ లక్ష్మి పరిస్థితి దారుణంగా మారిందని, అర్హత ఉన్న అనేక మంది లబ్ధిదారులు పెళ్లిళ్లు పూర్తయి చాలా కాలం గడిచినా తమకు రావాల్సిన ఆర్థిక సహాయం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. కొన్ని సందర్భాల్లో పిల్లలు పుట్టేంత కాలం గడిచినా కళ్యాణ లక్ష్మి సాయం అందని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

 

*హైకోర్టులో కళ్యాణ లక్ష్మి అంశంపై ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై కూడా బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ప్రశ్నించారు.* నాలుగుసార్లు గడువు ఇచ్చినా ప్రభుత్వం ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదని నిలదీశారు. పేదింటి ఆడబిడ్డల ప్రయోజనాలకు సంబంధించిన కీలకమైన అంశంలో ప్రభుత్వం తన వాదనను బలంగా వినిపించాల్సిన బాధ్యత ఉందని అన్నారు.

 

ముఖ్యమంత్రి, మంత్రులకు సంబంధించిన వివిధ కేసులు, అవినీతి ఆరోపణలు, ఇతర అంశాల్లో ప్రైవేటు న్యాయవాదులను భారీ మొత్తాలు చెల్లించి నియమించుకునే ప్రభుత్వం, పేదింటి ఆడబిడ్డల ప్రయోజనాలకు సంబంధించిన కళ్యాణ లక్ష్మి పథకాన్ని కాపాడేందుకు మాత్రం ఎందుకు సమర్థవంతంగా న్యాయపోరాటం చేయలేదని ప్రశ్నించారు.

 

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు కేవలం ప్రభుత్వ పథకాలు మాత్రమే కాదని, తెలంగాణలోని పేదింటి ఆడబిడ్డల *ఆత్మగౌరవం, భవిష్యత్తు, కుటుంబాలకు ఆర్థిక భరోసాతో ముడిపడిన సంక్షేమ కార్యక్రమాలని* బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు.

 

కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా రాజకీయ కక్ష సాధింపులను పక్కనపెట్టి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను పూర్తిస్థాయిలో కొనసాగించాలని, పెండింగ్‌లో ఉన్న అర్హులైన లబ్ధిదారుల దరఖాస్తులను వెంటనే పరిష్కరించి ఆర్థిక సహాయాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

 

తెలంగాణ ఆడబిడ్డలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని, తులం బంగారం హామీని నిలబెట్టుకోవాలని, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయకూడదని బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసింది.

 

ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ దండు నీతు కిరణ్ శేఖర్,మాజీ NUDA చైర్మెన్ ప్రభాకర్ రెడ్డి, సత్య ప్రకాష్,నవీద్ ఇక్బాల్,అబ్దుల్ మతీన్, జగత్ రెడ్డి ,బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, యువ నాయకులు, వివిధ విభాగాల ప్రతిని

ధులు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
BMA
The Four Pillars: Shifting to Solutions Journalism
Traditional reporting often stops at identifying systemic failures, leaving audiences paralyzed...
By JoinBMA 2026-08-22 04:10:14 0 141
Telangana
తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ స్థలాన్ని పరిశీలించిన మంత్రులు అధికారులు ప్రజాప్రతినిధులు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా భారత్ ఆవాజ్ న్యూస్" కౌటాల మండలం తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ స్థలాన్ని...
By Chunarkar Jagadeesh 2026-05-08 19:06:17 0 1K
Telangana
నిజామాబాద్: మే 1 నుoడి నిబంధ అమలు సిపి సాయి చైతన్య
నిజామాబాద్ జిల్లా ప్రజలు ఈ క్రింది నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని  నిజామాబాద్ CP పి. సాయి...
By Sadaq Sadaq 2026-05-01 07:07:57 0 178
SURAKSHA
Subrat Sahoo: Driving Chhattisgarh's Administrative Excellence
A distinguished 1992-batch IAS officer of the Chhattisgarh cadre, Subrat Sahoo has earned...
By Lokeshwari Panthadi 2026-07-29 12:56:45 0 112
Andhra Pradesh
యాక్సిడెంట్.. లారీ డ్రైవర్ మృతి
కొత్తవలస మండలం కంటకాపల్లి రైల్వే సైడింగ్ వద్ద శనివారం ప్రమాదం జరిగింది. ఎల్.కోట మండలంలో ఓ...
By Boiena Rajesh 2026-03-14 12:17:06 0 245
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com