నిరుద్యోగ సమస్యలపై కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం DYFI రాష్ట్ర అధ్యక్షుడు కోటా రమేష్ ధ్వజమెత్తారు

0
215

ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్):తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను దగా చేసిందని DYFI రాష్ట్ర అధ్యక్షుడు కోటా రమేష్ విమర్శించారు. ఆసిఫాబాద్‌లో జరిగిన నిరుద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడుతు. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, నెలకు ₹4,000 నిరుద్యోగ భృతి చెల్లిస్తామని 17 రకాల హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. కానీ రెండున్నరేళ్ల పాలనలో కేవలం 60,000 ఉద్యోగాలకే పరిమితమై, లక్షలాది ఖాళీలను భర్తీ చేయకుండా కాలయాపన చేస్తోందని మండిపడ్డారు.రాష్ట్రంలో లక్షలాది మంది యువత డీఎస్సీ (DSC), గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారని రమేష్ పేర్కొన్నారు. పోలీస్ శాఖలో 21,000 ఖాళీలు ఉన్నట్లు డీజీపీ లెక్కలు చెబితే, ప్రభుత్వం కేవలం 7,000 పోస్టులకే నోటిఫికేషన్ ఇవ్వడం అన్యాయమన్నారు. ఆసిఫాబాద్ లాంటి వెనుకబడిన ప్రాంతాల యువత కోసం తక్షణమే అన్ని ఖాళీలకు పూర్తిస్థాయి నోటిఫికేషన్లు ఇవ్వాలని, లేనిపక్షంలో నిరుద్యోగులతో కలిసి పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని కోటా రమేష్ హెచ్చరించారు.

Search
Categories
Read More
Telangana
ఆపదలో ఆపద్బాంధవులు : బాధితురాలి కన్నీరు తుడిచిన అల్వాల్ క్రైమ్ టీం .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటూ, విధి నిర్వహణలో అల్వాల్ పోలీసులు మరోసారి...
By Sidhu Maroju 2026-03-14 16:21:34 0 187
Telangana
హిందూ స్మశాన వాటికలో చెత్త డంపింగ్ నిలిపివేయండి.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  :  మచ్చ బొల్లారం పరిధిలోని సర్వే నెంబర్...
By Sidhu Maroju 2026-02-23 15:43:34 0 244
Andhra Pradesh
రాష్ట్రంలో గ్యాస్ ఇందన కొరతలేదు
రాష్ట్రంలో వంట గ్యాస్, పెట్రోలు, డీజిల్ కొరత లేదు • నెల రోజుల్లో లక్ష పీఎన్జీ కనెక్షన్లు...
By Rajini Kumari 2026-03-26 13:39:20 0 223
Telangana
నేటి నుంచి చిలుకూరు ఆలయ బ్రహ్మోత్సవాలు
తెలంగాణ తిరుపతిగా పేరు గాంచిన చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. నేడు సెల్వార్...
By Veeresh Kumar 2026-03-27 07:24:24 0 575
Telangana
1 sq.yd of land in KPHB has reached up to 2.65 lakhs
The Lands and Plots in KPHB has been sold out in higher rates. The flat of 1400 sft has costed...
By Terli Ashok 2026-02-27 14:22:33 0 518
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com