హుజూర్‌నగర్ ఆర్డీవో కార్యాలయం ఎదుట భూములు కోల్పోయిన రైతుల ధర్నా

0
201

హుజూర్‌నగర్, జూలై 27:

 

వ్యవసాయ కళాశాల కోసం 1041 సర్వే నంబరులో భూములు కోల్పోయిన రైతులు సోమవారం హుజూర్‌నగర్ ఆర్డీవో కార్యాలయం నందు RDO గారిని కలిసి గతంలో ప్రభుత్వం, అధికారులు ఇచ్చిన హామీల అమలుపై వివరణ కోరారు. ఈ సందర్భంగా రైతులు ఆర్డీవోతో సమావేశమై భూములు కోల్పోయిన ప్రతి రైతు కుటుంబానికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, మగ్దుమ్‌నగర్ గ్రామానికి శ్మశానవాటిక కేటాయింపు వంటి హామీల అమలు గురించి ప్రశ్నించారు.

 

రైతుల కథనం ప్రకారం, మొత్తం 238 ఎకరాల భూమిని వ్యవసాయ కళాశాల కోసం రెండు విడతలుగా భూసేకరణ చేశారు. మొదటి విడతలో 100 ఎకరాలకు ఎకరాకు ₹24 లక్షల చొప్పున పరిహారం చెల్లించగా, రైతులు అప్పట్లో ₹30 లక్షలు ఇవ్వాలని కోరినప్పటికీ ప్రభుత్వం అంతకంటే ఎక్కువ రేటు ఇవ్వడం సాధ్యం కాదని అధికారులు చెప్పారని తెలిపారు. అలాగే, మొత్తం 238 ఎకరాలకు ఒకే రేటు వర్తిస్తుందని అప్పట్లో హామీ ఇచ్చారని రైతులు పేర్కొన్నారు.

 

అయితే అనంతరం రెండో విడతలో సేకరించిన 138 ఎకరాలకు ఎకరాకు ₹27 లక్షల చొప్పున పరిహారం చెల్లించారని, దీంతో మొదటి విడతలో భూములు ఇచ్చిన రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అన్యాయంపై గతంలో పలుమార్లు అధికారులను కలిసి వినతిపత్రాలు అందించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని రైతులు ఆరోపించారు.

 

ఈరోజు జరిగిన సమావేశంలో కూడా ఉద్యోగాలు, ఇందిరమ్మ ఇళ్లు, భూ పరిహారంలో జరిగిన వ్యత్యాసంపై రైతులు ఆర్డీవోను ప్రశ్నించారు. దీనికి స్పందించిన ఆర్డీవో, అర్హులైన వారు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపినట్లు రైతులు వెల్లడించారు.

 

దీనిపై రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, భూములు కోల్పోయిన ప్రతి రైతు కుటుంబానికి ఇల్లు ఇస్తామని గతంలో హామీ ఇచ్చి, ఇప్పుడు "అర్హులైన వారికి మాత్రమే" అంటున్నారని ప్రశ్నించారు. అలాగే పరిహారం రేటులో జరిగిన వ్యత్యాసాన్ని సరిచేయాలని కోరగా, రెండు విడతల్లో భూసేకరణ జరిగినందున వేర్వేరు రేట్లు అమలయ్యాయని, అందులో మార్పు సాధ్యం కాదని ఆర్డీవో చెప్పినట్లు రైతులు తెలిపారు.

 

అధికారుల సమాధానంతో అసంతృప్తి చెందిన రైతులు హుజూర్‌నగర్ ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. భూములు కోల్పోయిన ప్రతి రైతు కుటుంబానికి ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, భూ పరిహారంలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని వారు డిమాండ్ చేశారు.

References

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు ఈసీఎల్ కంపెనీ వద్ద స్థానికుల నిరసన
పుంగనూరు మండలంలోని ఈసీఎల్ పరిశ్రమలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని స్థానికులు శనివారం...
By Kothuru Murali 2026-01-17 12:31:46 0 183
Telangana
ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి -రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి
మహబూబాబాద్,డిసెంబర్ 22 (భారత్ అవాజ్):రాష్ట్రంలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేసి త్వరగా...
By Bheeshman King 2025-12-22 12:55:24 0 336
Karnataka
New Alcohol-in-Beverage Tax Structure Rolls Out
Karnataka has implemented a pioneering Alcohol-in-Beverage (AIB) excise policy, shifting taxation...
By Dunna Jessicaruth 2026-05-18 06:55:06 0 102
BMA
Archival Depth: Slow News Preserving Historical Truth
Breaking news often lacks historical memory, treating ongoing crises as isolated events rather...
By JoinBMA 2026-08-24 06:12:38 0 209
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com