కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా లో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి GGHలో రోగులకు పండ్ల పంపిణీ

0
268

🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్,:  తెలంగాణ ఐటీ శాఖ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజాప్రతినిధులు కలిసి ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (GGH)లో చికిత్స పొందుతున్న రోగులను స్వయంగా పరామర్శించి, ఆసుపత్రి వార్డులను సందర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటూ ధైర్యం చెప్పారు. అనంతరం ఆసుపత్రిలోని రోగులందరికీ పండ్లను పంపిణీ చేసి వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కేటీఆర్ లాంటి డైనమిక్ లీడర్ జన్మదినం నాడు ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉందని నాయకులు పేర్కొన్నారు. ఈ సేవా కార్యక్రమంలో ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ ఎండి అహ్మద్, రాజంపేట సర్పంచ్ బుర్ర పోచయ్య, బిఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడు అహ్మద్ బీన్ అబ్దుల్లా ముఖ్య అతిథులుగా పాల్గొనగా, వీరితో పాటు కౌన్సిలర్లు చిలువేరు వెంకటేశ్వర్లు, సాలం బీన్ అహ్మద్, సీనియర్ నాయకులు సయ్యద్ అన్సర్, సయ్యద్ నిసార్, జీజీహెచ్ డాక్టర్ రవీందర్, దూడల అశోక్, పొన్నాల నారాయణ, గుండా శ్యామ్, నాగరాజు, షకీర్, జయరాజ్, సంగీత తదితర పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Search
Categories
Read More
BMA
Truth Defenders: Press Debunks Fake State Narratives
In an era of fabricated stories and deepfakes, the press serves the public by rigorously...
By JoinBMA 2026-08-20 06:05:10 0 128
Telangana
మన్ పిశాన్ "సినిమా బడ్జెట్"33 వేలల్లోనే ?
మన్ పిశాన్ అనే సినిమా 33 వేలల్లోనే తీశారని .. ఒకే రోజు షూటింగ్ లో పూర్తి చేసుకుందని నిన్న మొన్నటి...
By Ponnala Srinivasrao 2026-03-16 02:01:17 0 293
Telangana
C M revanth redsy meets America delavr city governor
ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని అమెరికా డెలావర్ రాష్ట్ర గవర్నర్ మాట్ మేయర్ గారు...
By G k Nookala 2026-03-07 08:21:06 0 297
Telangana
వట సావిత్రి వ్రతంలో సబిత అనిల్ కిషోర్.|
"భక్తిశ్రద్ధల మధ్య ఆధ్యాత్మిక వేడుక." మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్‌లోని Burtonguda...
By Sidhu Maroju 2026-06-29 10:36:18 0 185
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com