పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగుల తరలింపు

0
218

పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగుల తరలింపు

మార్గమధ్యంలో మంగళగిరి వద్ద స్వాగతం పలికిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారుకుంకీలకు స్వయంగాఆహారంఅందించిన ఉపముఖ్యమంత్రివర్యులు

జెండా ఊపి గుచ్చిమి క్యాంపుకు సాగనంపిన శ్రీ Pawan Kalyan గారు

పార్వతీపురం మన్యం జిల్లాలో మానవ-ఏనుగు సంఘర్షణల నివారణ చర్యలను బలోపేతం చేసే దిశగా పలమనేరు ముసలమడుగు ఏనుగుల శిబిరం నుంచి గుచ్చిమి ఏనుగుల శిబిరానికి తరలిస్తున్న శిక్షణ పొందిన కుంకీ ఏనుగులు జయంత్, అభిమన్యులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి క్యాంపు కార్యాలయం వద్ద స్వాగతం పలికారు. గజరాజులకు మార్గమధ్యంలో పూలు చల్లి స్వాగతం పలికిన ఉప ముఖ్యమంత్రివర్యులు, వాటికి స్వయంగా ఆహారం అందజేశారు. అనంతరం గుచ్చిమి శిబిరానికి బయలుదేరిన కుంకీల రెండో అంచె ప్రయాణాన్ని జెండా ఊపి సాగనంపారు. 

ఈ సందర్భంగా ప్రయాణంలో కుంకీల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై అటవీ శాఖ అధికారులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారు. గుచ్చిమి క్యాంపునకు చేరిన అనంతరం నిపుణుల పర్యవేక్షణలో అక్కడి వాతావరణ పరిస్థితులకు అలవాటుపడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జయంత్, అభిమన్యుల సేవలు పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో మానవ-ఏనుగు ఘర్షణల నియంత్రణకు ఎంతో ఉపయోగపడనున్నాయని ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. ప్రజల భద్రత, రైతుల పంటల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణ లక్ష్యాలను కూటమి ప్రభుత్వం శాస్త్రీయ, మానవీయ విధానాలతో చేపడుతున్న చర్యల్లో భాగంగా కుంకీలను తరలిస్తున్నామని అన్నారు.ఒడిశా వైపు నుంచి ఏనుగులు ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి ఏనుగుల గుంపులు తరచూ పార్వతీపురం మన్యం జిల్లాలోకి ప్రవేశిస్తూ పంటలు, ఆస్తులకు నష్టం కలిగిస్తున్న నేపథ్యంలో, మానవ-ఏనుగు ఘర్షణల నివారణకు కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రత్యేక చర్యల్లో భాగంగా ఈ కుంకీ ఏనుగులను గుచ్చిమి శిబిరానికి తరలిస్తున్నారు. మానవ-ఏనుగు ఘర్షణల నివారణ చర్యల్లో భాగంగా కుంకీ ఏనుగులైన జయంత్, అభిమన్యులను వినియోగిస్తారు. 

గతంలో పలమనేరు, చిత్తూరు ప్రాంతాల్లో నిర్వహించిన పలు కీలక ఆపరేషన్లలో ఈ రెండు కుంకీ ఏనుగులు కీలక పాత్ర పోషించాయి. అడవి ఏనుగుల గుంపులను సురక్షితంగా అటవీ ప్రాంతాలకు మళ్లించడంలో ఎంతో చురుకుగా వ్యవహరించాయి.

Search
Categories
Read More
Andhra Pradesh
Bill Gates: బిల్ గేట్స్‌కు గన్నవరంలో మంత్రి లోకేశ్ ఘన స్వాగతం.
ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న బిల్ గేట్స్ బిల్ గేట్స్ ‌కు స్వాగతం...
By Pagadala Venkateswar 2026-02-16 05:08:10 0 231
Andhra Pradesh
బసినికొండ వద్ద రోడ్డు ప్రమాదం – యువకుడికి తీవ్ర గాయాలు.
మదనపల్లె సమీపంలోని బసినికొండ వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కళ్యాణ్ (24) అనే యువకుడు...
By Pagadala Venkateswar 2026-04-09 04:33:58 0 159
Andhra Pradesh
ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఒక వ్యక్తి వీరంగం.
మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రి వద్ద సోమవారం ఒంటినిండా రక్తంతో ఉన్న ఓ వ్యక్తి వీరంగం...
By Pagadala Venkateswar 2026-03-10 04:35:37 0 195
Andhra Pradesh
సుప్రసిద్ధ వీణ విద్వాంసులు సంగీత విద్వాంసులు సుందరం బాలచందర్
సుప్రసిద్ధ వీణా విద్వాంసులు, దక్షిణ భారత చలనచిత్ర దర్శకుడు, నటుడు మరియు సంగీత దర్శకుడు సుందరం...
By Rajini Kumari 2026-04-15 13:25:23 0 220
Karnataka
Karnataka Boosts Textile and Apparel Industry Growth
Karnataka continues to strengthen its textile and apparel sector through policy support,...
By Fathima Safa 2026-06-27 11:49:07 0 88
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com