లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత నేత్ర శిబిరం

0
231

ఐ వి వై విద్యాసంస్థ లో ఉచిత నేత్ర శిబిరం, కంటి సంరక్షణతో పాటు దేశభక్తి సందేశం ... ఘనంగా ముగిసిన జాతీయ జెండా స్వీకరణ దినోత్సవ వేడుకలు ... కరీంనగర్ సీతారాంపూర్‌లోని (సీబీఎస్ఈ) విద్యాసంస్థలో లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత నేత్ర పరీక్షా శిబిరం వైభవంగా ముగిసింది. పాఠశాలలోని విద్యార్థులందరికీ ఉచితంగా నిర్వహించిన ఈ నేత్ర శిబిరంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని కంటి ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ పసుల మహేష్ మాట్లాడుతూ, ప్రస్తుతం విద్యార్థులు మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు వంటి డిజిటల్ పరికరాలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కంటి సమస్యలు పెరుగుతున్నాయని, వాటిని ముందుగానే గుర్తించి నివారించేందుకు ఈ ఉచిత నేత్ర పరీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు పాఠశాల ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. అనంతరం పాఠశాల ఆవరణం అసెంబ్లీ ప్రాంగణంలో జూలై 22 జాతీయ జెండా స్వీకరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రేడ్–3 నుండి గ్రేడ్–9 వరకు విద్యార్థులకు జాతీయ పతాకం గొప్పతనం తెలియజేసే ఉద్దేశంతో వ్యాసరచన, చిత్రలేఖనం, క్విజ్ పోటీలను పాఠశాల యాజమాన్యం నిర్వహించారు. ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు లయన్స్ క్లబ్ ప్రతినిధులు శివకాంత్ రెడ్డి (ప్రెసిడెంట్), బట్టు వినోద్ (సెక్రటరీ), మెతుకు కృష్ణ చైతన్య, పాఠశాల చైర్మన్ పసుల మహేష్ చేతుల మీదుగా విద్యార్థులకు మెమొంటోలు ( జ్ఞాపికలు ) అందజేశారు . అంతేకాకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరికీ సర్టిఫికెట్స్ అందజేశారు .ఇటువంటి కార్యక్రమాలు పాఠశాలలో ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థుల సృజనాత్మకత ,ఆత్మవిశ్వాసం పెరుగుతుందని లయన్స్ క్లబ్ ప్రతినిధులు పేర్కొన్నారు .

Search
Categories
Read More
Andhra Pradesh
అక్రమ పెన్షన్లపై పోలీసులకు ఫిర్యాదు
నిబంధనలకు విరుద్ధంగా అధిక పెన్షన్ పొందుతున్న ముగ్గురు రిటైర్డ్ ఉద్యోగులపై బొబ్బిలి పోలీసులు కేసు...
By Boiena Rajesh 2026-04-21 05:20:01 0 201
Andhra Pradesh
చిన్నారులు వేద సహస్ర సుకృతిలకు వేద ఆశీస్సులు అందజేసిన సుగవాసి ప్రసాద్ బాబు
ఈరోజు రాయచోటి పట్టణం మాసాపేట రెడ్డి వారి పల్లెలో చిన్నారులు వేద సహస్ర సుకృతిలకు కేశఖండన...
By Benguluri Madhubabu 2026-02-26 11:13:25 0 264
Andhra Pradesh
మదనపల్లి: ప్రభుత్వ ప్రణాళికలకు జనగణనే ప్రాతిపదిక: కలెక్టర్.
ప్రభుత్వ విధానాల రూపకల్పనకు, సంక్షేమ పథకాల అమలుకు ఖచ్చితమైన జనగణన గణాంకాలే బలమైన పునాది అని...
By Pagadala Venkateswar 2026-02-28 06:28:14 0 165
Andhra Pradesh
ఆటోని కారు ఢీకొన్న ప్రమాద ఘటనలో ఇద్దరు మృతి
ఆటోని కారు ఢీకొన్న సంఘటనలో మహిళతో సహా ఇరువురి మృతి.. నందిగామ ఎన్టీఆర్ జిల్లా  ఆటోని కారు...
By Patan Khuddus 2026-04-25 11:11:48 0 298
Telangana
ఆసిఫాబాద్ మున్సిపాలిటీ లో రూ1.20 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎంమ్మెల్యే కోవాలక్ష్మి
🎤ఆసిఫాబాద్ భరత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి చునర్కర్ జగదీష్. మే 14):కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా...
By Chunarkar Jagadeesh 2026-05-14 18:09:14 0 631
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com