MLA ఆదివాసీలకు క్షమాపణ చెప్పాలి

0
656

మహబూబాబాద్ :  బయ్యారం మండలంలో గిరిజనేతరులకు అన్యాయం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కు మెమోరండం ఇవ్వడంపై ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ తీవ్రంగా ఖండిస్తుంది.

 ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసి రైతులు ఆదివాసీ యువతీ యువకులు నిరుద్యోగులు విద్యార్థులు ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారని ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతంలో విచ్చలవిడిగా గిరిజనేతరుల వలసలు పెరిగి ఏజెన్సీ ఏరియాలో గిరిజనేతరులు ఆర్థికంగా రాజకీయంగా తమ పలుకుబడిని పెంచుకొని ఆదివాసీ గూడలలో గిరిజనేతరులు ఎన్ని విధాలుగా ఆదివాసీలను ఇబ్బందులకు గురి చేస్తున్నారో తెలీదా... అని ప్రశ్నించారు.

ఆదివాసులకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు చట్టాలకు ఇబ్బందులు తలపెడుతూ 5 వ షెడ్యూల్ ఏజెన్సీ చట్టాలను ఒక్కొకటిగా తీసివేయాలని గిరిజనేతరులు కంకణం కట్టుకొని కోర్టుల చుట్టూ తిరుగుతుంటే ఆదివాసులు ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులు కనుగుమరుగైపోతున్నాయని తిరిగి 5 షెడ్యూల్ ఏజెన్సీ చట్టాలను హక్కులను జీవోలను తిరిగి అమలు అయ్యేలా నిత్యం ఆదివాసీ సంఘాలు ఆదివాసీ ప్రజలు పోరాటం దిశగా ప్రయాణం చేస్తుంటే ఒక ఆదివాసి ప్రజా ప్రతినిది అయిన ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆదివాసీల పక్షాన కాకుండా గిరిజనేతరుల పక్షాన మాట్లాడంపై ఆదివాసులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే MLA ఆదివాసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

బాధ్యత గల హోదాలో ఉండి ఇటువంటి చర్యలకు పాల్పడడం మనుకొని ఏజెన్సీ ప్రాంత  నిరుద్యోగులైన ఆదివాసీ యువతీ యువకుల కోసం జీవో నెంబర్ 03, ఐటీడీఏ లలో ఉన్న బ్యాక్లాగ్ పోస్టుల గురించి, ఏజెన్సీ చట్టాలైన పేసా చట్టం,1/70 చట్టాల అమలుకోసం ఆదివాసీ రైతుల కోసం గిరివికాస ధ్వారా బోర్లు ఆదివాసి సమాజానికి ఉపయోగపడే సంక్షేమం కోసం ఆలోచన చేయాలని ST రిజర్వేషన్ ఉన్నది కాబట్టే ఈ రోజు ఎంతో మంది ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతున్నారని వివిధ రంగలలో రానిస్తున్నారని ఇట్టి విషయాన్ని గ్రహించాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈకార్యక్రమంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు సువర్ణపాక వెంకట రత్నం,తుడుందెబ్బ కొత్తగూడ, గంగారం మండల అధ్యక్షులు పూనేం సందీప్ కుమార్, ఈసం శ్యామ్ రావు, మండల ప్రధాన కార్యదర్శి తుడుం దెబ్బ నాయకులు సువర్ణపాక బాబీ, చుంచ శోభన్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
"Dr. Koshal Kumar Sharma IPS: Policing Ladakh with Vision"
A 2012-batch AGMUT IPS officer whose scientific background, disciplined leadership, and...
By Lokeshwari Panthadi 2026-07-29 06:14:49 0 459
Telangana
హన్మకొండ లో రికార్డు డ్రంక్ అండ్ డ్రైవ్ రీడింగ్.|
    హైదరాబాద్ :  న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మద్యం తాగి వాహనాలు నడిపే వారిని...
By Sidhu Maroju 2025-12-31 16:35:31 0 217
Telangana
నిజామాబాద్
ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది....
By Sadaq Sadaq 2026-05-16 01:39:13 0 126
SURAKSHA
"Sindhu Pillai A., IPS: Safeguarding Andaman with Vision"
An accomplished IPS officer leading law & order, intelligence, disaster management, and...
By Lokeshwari Panthadi 2026-07-24 07:01:52 0 515
Telangana
ఆలయాల చెక్కుల పంపిణీ కార్యక్రమం లో తీవ్ర ఉద్రిక్తత. కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకుల పరస్పర దాడులు
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ సర్కిల్ లో ఆషాడ మాస బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ...
By Sidhu Maroju 2025-07-15 13:34:06 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com