కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా నూతన DTDO శ్రీ జాదవ్ అంబాజీకి ఘన సన్మానం

0
246

ఆసిఫాబాద్, జులై 22 భారత్ ఆవాజ్ ప్రతినిధి: జిల్లా గిరిజన సంక్షేమ శాఖ నూతన గిరిజన అభివృద్ధి అధికారి (DTDO) గా పదోన్నతిపై బాధ్యతలు స్వీకరించిన శ్రీ జాదవ్ అంబాజీ గారిని రాజ్ గోండ్ సేవా సమితి జాతీయ అధ్యక్షులు సిడెం అర్జు మాస్టర్ నేతృత్వంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అర్జు మాస్టర్ మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమం, విద్యాభివృద్ధి, సామాజిక పురోగతికి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూ, ఈ శాఖను ప్రజలకు మరింత చేరువ చేసే విధంగా నూతన అధికారి సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సన్మాన గ్రహీత శ్రీ జాదవ్ అంబాజీ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధి, ఆశ్రమ పాఠశాలల ప్రగతి మరియు సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలుకు అంకితభావంతో పనిచేస్తానని, ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాలు, అధికారులు, ప్రజల సహకారంతో గిరిజన సంక్షేమ కార్యక్రమాలను మరింత మెరుగ్గా అమలు చేయడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ పోరుబిడ్డ కొమురం భీమ్ ముని మనమడు కుమరం మాధవరావ్, జిల్లా సార్మేడి అధ్యక్షులు కుర్సెంగా మోతిరామ్, పీవీటీజీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు భీంరావ్, రాజ్ గోండ్ సేవా సమితి కార్యవర్గ సభ్యులు కూడ్మేత మారుతి, తాను లతో పాటు సంఘం నాయకులు, సభ్యులు, వివిధ గిరిజన సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన అధికారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మిషన్ హార్టీ విజన్ తో ఉద్యాన సాగు విస్తరణ
జిల్లాలో మిషన్ హార్టీ విజన్ అమలు ద్వారా ఉద్యాన పంటల సాగును విస్తరించి రైతులకు నిరంతర ఆదాయం...
By Boiena Rajesh 2026-03-05 14:45:24 0 245
Telangana
జీవితాంతం మంత్రిగా ఉన్న అభివృద్ది చేయలేవు
మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ ,కొత్తగూడ డిసెంబర్ 14 (భారత్ ఆవాజ్):మూడవ విడత...
By Bheeshman King 2025-12-14 13:42:01 0 409
Andhra Pradesh
అనంతపురం జిల్లా పుట్లూరులో విద్యార్థులు స్కూల్ బస్ కు అగ్నిప్రమాదం పూర్తిగా దగ్ధం..!
అనంతపురం జిల్లా పుట్లూరులో విద్యార్థులు స్కూల్ బస్ కు అగ్నిప్రమాదం పూర్తిగా దగ్ధం..! పుట్లూరు...
By Eslavath RameshNaik 2026-01-28 14:02:57 0 715
BMA
Expendable Voices: The Crisis of Rural News Stringers
The backbone of national news relies entirely on mofussil "stringers"—freelance village and...
By JoinBMA 2026-08-21 09:51:31 0 81
Himachal Pradesh
Himachal Strengthens Monsoon Disaster Preparedness in 2026
As the 2026 monsoon season progresses, the Himachal Pradesh government has intensified disaster...
By Fathima Safa 2026-07-06 06:28:40 0 207
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com