రాహుల్ గాంధీ అక్రమ అరెస్టుకు నిరసనగా ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణుల శాంతియుత ర్యాలీ

0
263

🎤ఆసిఫాబాద్, భారత్ ఆవాజ్ న్యూస్  దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ మరియు భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి అంబేద్కర్ చౌరస్తా వద్ద శాంతియుతంగా ప్రదర్శన నిర్వహించారు. అక్కడ ప్లకార్డులు పట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన నినాదాలు చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పాల్గొని మాట్లాడారు. దేశంలో నీట్ పేపర్ లీక్ ఘటనకు బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఈ శాంతియుత నిరసన ర్యాలీలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఇరుకుల్ల మంగ, వాంకిడి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నారాయణ, ఆసిఫాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ అబ్దుల్లా తో పాటు నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, జిల్లా మండల స్థాయి నాయకులు మరియు భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొని నిరసనను విజయవంతం చేశారు.

Search
Categories
Read More
Telangana
ఎన్. రాంచందర్ రావ్, ఇప్పుడు తెలంగాణలో ఈ పేరు మారుమోగుతోంది. ఇంతకీ ఈ ఎన్. రాంచందర్ రావ్ ఎవరంటే..!
హైదరాబాద్ కు చెందిన నరపరాజు రాంచందర్ రావు రాజనీతి శాస్త్రంలో ఎంఏతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ...
By Sidhu Maroju 2025-07-01 06:07:57 0 1K
SURAKSHA
Sudhir Rajpal, IAS: Driving Haryana's Growth with Vision
A distinguished 1990-batch IAS officer of the Haryana cadre, Sudhir Rajpal has played a...
By Lokeshwari Panthadi 2026-07-24 08:04:39 0 133
Andhra Pradesh
🌹🌹🌹 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు సామాన్యులకు, శ్రామికులకు ఆకలి తీర్చడానికి అత్యంత ప్రజాధరణ పొందిన పథకం అన్న క్యాంటీన్ ఈరోజు అన్న క్యాంటీన్ ఓపెనింగ్
🌹🌹🌹 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు సామాన్యులకు, శ్రామికులకు ఆకలి తీర్చడానికి అత్యంత ప్రజాధరణ...
By Chennaiah Kati 2026-04-15 07:32:25 0 310
SURAKSHA
Shatrujeet Kapur: A Legacy of Courage and Integrity
Leading with Purpose: An IPS Officer’s Journey to Excellence Introduction: In the...
By Kalaga Sailaja 2026-07-17 05:37:04 0 116
Andhra Pradesh
రాష్ట్ర కరాటే ఛాంపియన్‌షిప్‌లో పులినాడు విద్యార్థుల ప్రతిభ.
విజయవాడలోని మేరిస్ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో జరిగిన 24వ ఎస్కేడిఎ రాష్ట్ర కరాటే...
By Kothuru Murali 2026-08-05 11:22:40 0 171
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com