నెక్కొండ ఎస్ఐ సస్పెండ్... సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నెక్కొండ

0
157

వరంగల్ జిల్లా నర్సంపేట: సివిల్ వివాదంలో అనధికారికంగాజోక్యం చేసుకున్నారనే ఫిర్యాదులు రావడంతో శాఖాపరంగా విచారణ చేపట్టిన అనంతరం వరంగల్ జిల్లా నెక్కొండ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ మహేందర్ను సస్పెండ్ చేస్తూ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఉత్తర్వులు జారీ చేశారు. అవినీతి ఆరోపణలు, మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన ఓ రైతు ఎస్ఐ మహేందర్ విధి నిర్వహణలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలు చేయడం, గొర్లు కొనుగోళ్లకు సంబంధించి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ విషయంలో ఒక వైపు పక్షపాతం ప్రదర్శించినట్లు డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఒట్లు, తిట్లమీద ఉన్న ధ్యాస నీటి బొట్లమీద పెట్టు.. సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు విమర్శలుఉన్నతాధికారుల ఆదేశాలతో విచారణ జరిగినట్లు సమాచారం. ప్రాథమిక విచారణలో ఆరోపణలకు బలం ఉన్నట్లు తేలడంతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయినట్లు తెలుస్తోంది. పోలీస్ శాఖలో క్రమశిక్షణకు భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, విధి నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనంతో వ్యవహరించాలని పోలీస్ కమిషనర్ శ్వేత స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ ఘటన పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా నెక్కొండ ఎస్సె మహేందర్ మీద గతంలో పలు అభియోగాలు వచ్చిన సంగతి తెలిసిందే. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ పలుమార్లు పిర్యాదులు చేశారు. నెక్కొండలో సివిల్ సప్లై అధికారులు సీజ్ చేసిన పీడీఎస్ బియ్యం లారీ మాయం అయిన ఘటనలో ఎస్సై హస్తం ఉందని అప్పట్లో ప్రచారం జరగడం గమనార్హం.. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము 

Search
Categories
Read More
SURAKSHA
The Guardian of the Coast: IPS Sanjeeb Panda's Legacy
A Visionary Leader Redefining Coastal Security and Public Trust True leadership in law...
By Kalaga Sailaja 2026-07-21 11:53:44 0 160
SURAKSHA
AP Ex-Police: Heroes Without Uniform, With Heart
Description 99 words  Yesterday AP లో retire అయిన police officers retirement తర్వాత కూడా...
By Kalaga Sailaja 2026-07-03 13:40:27 0 142
Telangana
మంచిర్యాల జిల్లాలో నలుగురు ఎస్సైలు బదిలీ..
జిల్లాలో నలుగురు ఎస్సైలు బదిలీ చేస్తూ రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. నా...
By Bonagiri RaviShankar 2026-09-18 03:30:41 0 75
Dadra &Nager Haveli, Daman &Diu
DNHDD Expands Digital Governance and Public Services
Dadra & Nagar Haveli and Daman & Diu continue to advance digital governance by expanding...
By Fathima Safa 2026-07-06 06:18:07 0 165
Telangana
డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.|
హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్త, జాతీయవాది నాయకుడు డాక్టర్ శ్యామ్  ప్రసాద్...
By Sidhu Maroju 2026-06-23 08:25:58 0 182
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com