సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముట్టడి

0
245

మంచిర్యాల జిల్లా : తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ ( CITU ) ఆధ్వర్యంలో సోమవారం రోజున మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేట్ సంస్థలకు ఇవ్వద్దంటూ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం డిఈఓ కార్యాలయం సుపర్డెంట్ వేణు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా *అబ్బోజు రమణ దుంపల రంజిత్ కుమార్ సీఐటీయు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు* మాట్లాడుతూ.గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రుచికరమైన, నాణ్యమైన భోజనం వంట చేసి పెడుతున్న మధ్యాహ్న భోజన కార్మికులను పాఠశాలల నుండి వెళ్లగొట్టడానికి,విద్యార్థులకు రుచికరమైన నాణ్యమైన ఆహారాన్ని అందించకుండా ప్రభుత్వం కుట్ర చేస్తుందని ,గత సం,,ఈ పథకాన్ని హనుమకొండ జిల్లాలో ప్రవేశపెట్టారు.ఈ పథకం నిర్వాహకులు పెట్టేటువంటి భోజనం రుచికరంగా లేదని, నాణ్యతగా లేదని విద్యార్థులు తినలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిసింది. *దాగం రాజారాం* మధ్యాహ్న భోజన పథకం యూనియన్ (సిఐటియు) జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ... కనీస వేతన ఇవ్వకుండా కార్మికుల తోటి వెట్టిచాగరి చేయించుకుంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం కార్మికులకు 10,000/- వేతనం ఇవ్వాలన్నారు.

ఎండి.రఫియా, ఎండి కరీమా* తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ (సీఐటీయు) జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ..60 సం,లు వయసు పైబడిన కార్మికులను అకారణంగా తొలగించడం సరికాదన్నారు. అలా తొలగించే కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డుమెంట్ బెనిఫిట్ కింద రెండు లక్షల రూపాయల చెల్లించాలన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారులు, జిల్లా ప్రజా ప్రతినిధులు , స్పందించి మధ్యాహ్న భోజన పథకాన్ని యధావిధిగా కార్మికుల ద్వారానే కొనసాగించే విధంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గోమస ప్రకాష్ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు, సీఐటీయు జిల్లా కమిటీ సభ్యులు చల్లూరి దేవదాస్ , అంబటి లక్ష్మణ్ , మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు గడ్డం లక్ష్మి, సరిత, ఉమా, రమాదేవి, సవిత, కాంతమ్మ, సేపూరి లక్ష్మి, బుచ్చమ్మ, వరలక్ష్మి, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Telangana
పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి సస్పెన్షన్.
ఏసీబీ ఆకస్మిక తనిఖీల్లో అవకతవకలు వెలుగులోకి రావడంతో పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి కే.అలివేణిని...
By MOHAMMAD MUJEEBUDDIN 2026-02-25 23:21:44 0 1K
Telangana
గులాబీ జెండా ఎగరాలి
 బడే నాగజ్యోతి బిఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్   కొత్తగూడ డిసెంబర్ 14 (భారత్...
By Bheeshman King 2025-12-14 13:17:45 0 343
SURAKSHA
The Sentinel of Justice: The Illustrious Journey of DGP Y. B. Khurania
From Protecting Frontiers to Guarding the State: The Unwavering Resolve of Odisha’s Top Cop...
By Kalaga Sailaja 2026-07-17 13:17:04 0 186
Telangana
డ్రగ్స్‌కు 'నో'... ఆరోగ్యకరమైన జీవితానికి 'యెస్' చెప్పండి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
డ్రగ్స్‌కు 'నో'... ఆరోగ్యకరమైన జీవితానికి 'యెస్' చెప్పండి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్...
By Pinnehasan Odela 2026-06-26 13:45:39 0 209
SURAKSHA
Atal Dulloo, IAS: Steering Jammu & Kashmir's Progress
An Experienced IAS Officer Leading Governance, Development, and Administrative Reforms in Jammu...
By Lokeshwari Panthadi 2026-07-17 08:18:31 0 195
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com