*జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయం..*

0
204

*రాజన్న సిరిసిల్ల జిల్లా:://* *జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయం..* *టీయూడబ్ల్యూజే (హెచ్-143) సభ్యత్వ నమోదు ప్రారంభం..* BHARAT AWAZ * సిరిసిల్ల: జర్నలిస్టుల సంక్షేమం, వృత్తిపరమైన హక్కుల పరిరక్షణే తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ టీయూడబ్ల్యూజే హెచ్-143 ప్రధాన లక్ష్యమని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు లాయక్ పాషా స్పష్టం చేశారు. వేములవాడ ప్రెస్ క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కొలిపాక నరసయ్య, ప్రధాన కార్యదర్శి సయ్యద్ అలీ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ కొనసాగింది. ఈ సందర్భంగా లాయక్ పాషా మాట్లాడుతూ.. జర్నలిస్టుల వృత్తిగత గౌరవాన్ని కాపాడేందుకు, వారి సమస్యల పరిష్కారానికి సంఘం నిరంతరం పోరాడుతోందన్నారు. యూనియన్ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకుని, ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ నాయకత్వంలో జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పలు సంక్షేమ పథకాల అమలుకు కృషి చేసినట్లు గుర్తుచేశారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డులు, ఇళ్ల స్థలాల సాధన కోసం రాబోయే రోజుల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని భరోసా ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి సమిష్టి పోరాటాలే శరణ్యమని పేర్కొన్నారు. సమకాలీన సమాజంలో జర్నలిస్టులకు వృత్తిపరమైన సవాళ్లు పెరుగుతున్నాయని, ఇలాంటి తరుణంలో సంఘటితంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు జర్నలిస్టులు అభిప్రాయపడ్డారు. ఈ సభ్యత్వ నమోదు ప్రక్రియ జర్నలిస్టుల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు, స్థానిక జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని సభ్యత్వాలు నమోదు చేసుకున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: అవాస్తవాలు ప్రచారం చేయకండి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం దిగువపల్లిలోని శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో...
By Kothuru Murali 2026-01-23 12:54:57 0 199
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్ర్గం : గుర్తుతెలియని వ్యక్తి మృతి పై అప్డేట్
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం కల్లూరులో బుధవారం గుర్తు తెలియని వ్యక్తి...
By Kothuru Murali 2026-02-19 11:20:45 0 231
SURAKSHA
Makarand M. IAS: Inspiring Public Administration
A Young Telangana IAS Officer Driving Development Throunsparent Administration and...
By Lokeshwari Panthadi 2026-07-15 13:45:45 0 182
SURAKSHA
WB Police Empowering Women Through Saurabh Teams
 To ensure the safety of women and students, the West Bengal Police has deployed the...
By Kalaga Sailaja 2026-06-27 07:22:31 0 97
Maharashtra
Leading the Charge: Maharashtra’s VVIPs Pivot to EVs
In a significant push for green energy, Deputy CM Eknath Shinde officially transitioned his...
By Dunna Jessicaruth 2026-05-15 05:39:46 0 140
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com